Home Actor చిరు – నాగ్ ల‌తో లారెన్స్ సినిమా..!

చిరు – నాగ్ ల‌తో లారెన్స్ సినిమా..!

67
0


రాఘ‌వ లారెన్స్ తెర‌కెక్కించిన తాజా చిత్రం కాంచ‌న 3. ముని సినిమాకి 4వ పార్ట్ గా వ‌స్తున్న కాంచ‌న 3 సినిమా పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఈ సినిమాలో లారెన్స్ స‌ర‌స‌న‌ వేదిక, ఓవియా నటించారు. హ‌ర్ర‌ర్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాను ఏప్రిల్ 19వ తేదీన విడుదల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా కాంచ‌న 3 ట్రైలర్ ను లాంచ్ చేశారు. అనంత‌రం లారెన్స్ మాట్లాడుతూ….ముని కి తీసిన అన్ని పార్ట్ లు సూపర్ హిట్ అవడం థ్రిల్లింగ్ గా ఉంది.

ఇప్పుడు 4వ పార్ట్ గా వస్తున్న కాంచన 3 కూడా ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. దేవుని అనుగ్రహంతో, ప్రేక్షకుల ఆదరణతో 10 పార్ట్ ల వరకు తీయలనేది నా బలమైన కోరిక. నేను హీరోగా, డైరెక్టర్ గా సినిమాలు చేస్తూనే, నన్ను పెద్ద డాన్స్ మాస్టర్ని చేసిన మెగాస్టార్ చిరంజీవి గారితో ఒక సినిమా చేయాల‌నుకుంటున్నాను. అలాగే నన్ను మాస్ సినిమాతో డైరెక్టర్ ని చేసిన కింగ్ నాగార్జున గారితో ఒక సినిమా  చేయాలనేది నా కోరిక అన్నారు.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here