Home Actor చిరు మూవీలో అన‌సూయ‌. ఇంత‌కీ.. పాత్ర ఏంటి..?

చిరు మూవీలో అన‌సూయ‌. ఇంత‌కీ.. పాత్ర ఏంటి..?

90
0

మెగాస్టార్ చిరంజీవి – బ్లాక్ బ‌ష్ట‌ర్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ కాంబినేష‌న్ లో ఓ భారీ చిత్రం రూపొంద‌నుంది. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతోంది. ఇందులో మెసేజ్ తో పాటు ఎంట‌ర్ టైన్ మెంట్ కూడా ఉంటుంద‌ట‌. ఈ చిత్రాన్ని చిరంజీవి పుట్టిన‌రోజైన ఆగ‌ష్టు 22న ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే…ఈ సినిమా గురించి ఓ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. అది ఏంటంటే…ఇందులో అన‌సూయ న‌టిస్తుంద‌ట‌.

అదీ కూడా కీల‌క పాత్ర కావ‌డం విశేషం. ఈ పాత్రను అనసూయతో చేయిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో కొరటాల ఆమెను సంప్రదించడం .. ఆమె ఓకే చెప్పడం జరిగిపోయాయని అంటున్నారు. సోగ్గాడే చిన్ని నాయ‌నా, క్ష‌ణం, విన్న‌ర్, ఎఫ్ 2, యాత్ర త‌దిత‌ర చిత్రాల్లో న‌టించిన అన‌సూయ‌కి.. రంగ‌స్థ‌లం చిత్రంలోని రంగ‌మ్మ‌త్త పాత్ర ఎన‌లేని గుర్తింపుని తీసుకువ‌చ్చింది. ప్ర‌స్తుతం క‌థ‌నం, స‌చ్చిందిరా గొర్రె చిత్రాల్లో న‌టిస్తుంది. ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిరంజీవి చిత్రంలో న‌టించే ఛాన్స్ ద‌క్కింద‌ని స‌మాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here