Home Actor చిరు మూవీ టైటిల్ తో విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమా..!

చిరు మూవీ టైటిల్ తో విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమా..!

93
0


ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం, పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి…చిత్రాల‌తో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన యువ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఆత‌ర్వాత గీత గోవిందం సినిమాతో స్టార్ స్టేట‌స్ సొంతం చేసుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌స్తుతం డియ‌ర్ కామ్రేడ్ సినిమా చేస్తున్నారు. తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లో ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. భ‌ర‌త్ కమ్మ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ సినిమా మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ లో రూపొందుతోంది.

అయితే…మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో మ‌రో సినిమా చేసేందుకు రెడీ అవుతుంది. ఈ సినిమాని కూడా తెలుగు, త‌మిళ్, మ‌ల‌యాళ, క‌న్న‌డ భాష‌ల్లో నిర్మించ‌నున్నారు. ఈ సినిమాకి హీరో అనే టైటిల్ ఖ‌రారు చేసారు. గ‌తంలో చిరంజీవి హీరో అనే టైటిల్ తో సినిమా చేసారు. ఆత‌ర్వాత‌ నితిన్ కూడా హీరో టైటిల్ తో సినిమా చేసారు. ఇప్పుడు విజ‌య్ దేవ‌ర‌కొండ ఈ టైటిల్ తో సినిమా చేస్తుండ‌డం విశేషం. ఆనంద్ అన్నామ‌లై ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. ఏప్రిల్ 22న న్యూఢిల్లీలో షూటింగ్ స్టార్ట్ చేయ‌నున్నారు. త్వ‌ర‌లోనే పూర్తి వివ‌రాల‌ను తెలియ‌చేయ‌నున్నారు.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here