Home Telugu చిరు సైరాలో ర‌జ‌నీ హీరోయిన్..!

చిరు సైరాలో ర‌జ‌నీ హీరోయిన్..!

119
0

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తోన్న తాజా చిత్రం సైరా. స్టైలీష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందుతోన్న‌సైరా హైద‌రాబాద్ లో శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది.  అమితాబ్ బ‌చ్చ‌న్ కీల‌క పాత్ర పోషిస్తోన్న విష‌యం తెలిసిందే. ఇందులో న‌ర‌సింహారెడ్డి మొద‌టి భార్య పాత్ర‌లో న‌య‌న‌తార న‌టిస్తోంది. ఇక రెండో భార్య పాత్ర‌ను ఎవ‌రు పోషించ‌నున్నారు అనేది ఇప్ప‌టి వ‌ర‌కు తెలియ‌లేదు. తాజాగా ఈ పాత్ర కోసం హ్యుమా ఖురేషిని సంప్ర‌దించిన‌ట్టు స‌మాచారం.

హ్యుమా ఖురేషి ర‌జ‌నీకాంత్ స‌ర‌స‌న కాలా సినిమాలో న‌టించింది. అందం, అభిన‌యంతో ఆక‌ట్టుకున్న హ్యుమా ఖురేషి అయితే…న‌ర‌సింహారెడ్డి రెండో భార్య పాత్ర‌కు బాగుంటుంద‌ని చిత్ర యూనిట్ సంప్ర‌దించ‌డం…ఆమె క‌థ విని ఓకే చెప్పడం జ‌రిగిందని వార్త‌లు వ‌స్తున్నాయి. త్వ‌ర‌లోనే ఆమె షూటింగ్ లో జాయిన్ కానున్నార‌ని తెలిసింది. ఈ భారీ చిత్రాన్ని కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ బ్యాన‌ర్ పై మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ నిర్మిస్తున్నారు. మిల్కీబ్యూటీ త‌మ‌న్నా కూడా ఓ కీల‌క పాత్ర‌ను పోషిస్తుంది. అత్య‌ధిక బ‌డ్జెట్ తో రూపొందుతోన్న ఈ సినిమాను వ‌చ్చే సంవ‌త్స‌రం స‌మ్మ‌ర్ లో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here