Home Actor చిరు సైరా మేకింగ్ వీడియో రిలీజ్ డేట్ ఫిక్స్.

చిరు సైరా మేకింగ్ వీడియో రిలీజ్ డేట్ ఫిక్స్.

61
0

మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ సైరా న‌ర‌సింహారెడ్డి. ఈ భారీ చిత్రానికి స్టైలీష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. చిరు స‌ర‌స‌న‌ నయనతార కథానాయికగా నటించిన ఈ సినిమాలో అమితాబ్ కీలకమైన పాత్రను పోషించారు. ఈ సినిమా మేకింగ్ వీడియోను విడుదల చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఈ మేకింగ్ వీడియో రిలీజ్ కి తాజాగా ముహూర్తం ఖరారు చేశారు.

రేపు మధ్యాహ్నం అన‌గా ఈ నెల 14న  3 గంటల 45 నిమిషాలకి ఈ మేకింగ్ వీడియోను విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని తెలియచేస్తూ… ఓ స్పెషల్ పోస్టర్ ను ట్విట్ట‌ర్ ద్వారా రిలీజ్ చేసారు ఈ పోస్ట‌ర్ మెగా అభిమానులను ఆకట్టుకునేలా వుంది. కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ బ్యాన‌ర్ పై మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

ఈ సినిమాను తెలుగుతో పాటు ఇతర భాషల్లోను విడుదల చేయనున్నారు. ఈ కారణంగానే ఆయా భాషలకి చెందిన నటీనటులు ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. వ‌ర‌ల్డ్ వైడ్ గా సైరా న‌ర‌సింహారెడ్డి చిత్రాన్ని ద‌స‌రా కానుక‌గా అక్టోబర్ 2వ తేదీన రిలీజ్ చేయ‌నున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here