Home Actor చిరు సైరా రిలీజ్ ఎప్పుడు..?

చిరు సైరా రిలీజ్ ఎప్పుడు..?

89
0

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తోన్న తాజా చిత్రం సైరా న‌ర‌సింహారెడ్డి. స్టైలీష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా రూపొందుతోంది. కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ బ్యాన‌ర్ పై రామ్ చ‌ర‌ణ్ ఏమాత్రం రాజీప‌డ‌కుండా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. భారీ బ‌డ్జెట్ తో రూపొందుతోన్న ఈ సినిమాని ఎప్పుడెప్పుడు తెర పై చూస్తామా అని అభిమానులు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే..ఈ మూవీ ద‌స‌రాకి రిలీజ్ కానుందా..? సంక్రాంతికి రిలీజ్ కానుందా..? అనే విష‌యంలో ఇప్ప‌టి వ‌ర‌కు క్లారిటీ లేదు.

ఇటీవ‌ల రామ్ చ‌ర‌ణ్ విన‌య విధేయ రామ ప్ర‌మోష‌న్ లో భాగంగా మీడియాకి ఇచ్చిన ఇంట‌ర్ వ్యూలో సైరా గురించి మాట్లాడుతూ..ద‌స‌రాకి రిలీజ్ చేయాల‌నుకుంటున్నాం అని చెప్పారు కానీ..ఆత‌ర్వాత సైరా సంక్రాంతికి రిలీజ్ కానుంది అని వార్త‌లు వ‌చ్చాయి. ఇదిలా ఉంటే..ప్ర‌స్తుతం రామోజీ ఫిలింసిటీలో సైరా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. మార్చి చివరకు లేదా ఏప్రియల్ నెలాఖరు లోపు మొత్తం షూటింగ్ వర్క్  పూర్త‌వుతుంద‌ని తెలిసింది. దసరా కు విడుదల అనుకున్నా అక్కడికి ఇంకా ఆరునెలలు టైమ్ వుంటుంది. సి జి వర్క్ కు, పోస్ట్ ప్రొడక్షన్ కు ఇది సరిపోతుంది కాబ‌ట్టి ద‌స‌రాకి రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌. షూటింగ్ పూర్తైన త‌ర్వాత రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తారేమో చూడాలి.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here