Home Actor చిరు స‌ర‌స‌న ఐశ్వ‌ర్య‌రాయ్

చిరు స‌ర‌స‌న ఐశ్వ‌ర్య‌రాయ్

39
0
చిరు స‌ర‌స‌న ఐశ్వ‌ర్య‌రాయ్ spiceandhra

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం సైరా న‌ర‌సింహారెడ్డి సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. స్టైలీష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ భారీ చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటోంది. కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ బ్యాన‌ర్ పై రామ‌చ‌ర‌ణ్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. చిరు స‌ర‌స‌న న‌య‌న‌తార న‌టించ‌గా, అమితాబ్ కీల‌క పాత్ర‌ను పోషించారు. ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 2న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది.

ఈ సినిమా త‌ర్వాత చిరు.. బ్లాక్ బ‌ష్ట‌ర్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌తో సినిమా చేయ‌నున్నారు. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతోంది. త్వ‌ర‌లోనే సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమాలో చిరంజీవి స‌ర‌స‌న అందాల తార న‌య‌న‌తార‌నే న‌టింప చేయాలి అనుకున్నార‌ట‌. అయితే…లేటెస్ట్ న్యూస్ ఏంటంటే… కొర‌టాల‌ ఐశ్వ‌ర్య రాయ్ అయితే బాగుంటుంద‌ని చెప్ప‌డం.. దీనికి చిరు, చ‌ర‌ణ్ ఓకే అన‌డంతో  కాంటాక్ట్ చేసిన‌ట్టు స‌మాచారం.

ఈ వార్త ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. ఈ మూవీలో ఐష్ న‌టించ‌డం క‌న్ ఫ‌ర్మ్ అంటూ జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి.. ప్ర‌చారంలో ఉన్న వార్త వాస్త‌వ‌మేనా..?  కాదా..?  క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here