Home Movie News చైతు – చందుల స‌వ్య‌సాచి లేటెస్ట్ న్యూస్..!

చైతు – చందుల స‌వ్య‌సాచి లేటెస్ట్ న్యూస్..!

106
0
1521184793_naga-chaitanyas-first-look-savyasachi

అక్కినేని నాగ‌చైత‌న్య – ప్రేమ‌మ్ ఫేమ్ చందు మొండేటి కాంబినేష‌న్లో రూపొందుతోన్న భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ స‌వ్య‌సాచి. మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. చైత‌న్య స‌ర‌స‌న నిధి అగ‌ర్వాల్ న‌టించింది. భూమిక‌, మాధ‌వ‌న్ ముఖ్య పాత్ర‌లు పోషించారు.ఇటీవ‌ల రామానాయుడు స్టూడియోలో జ‌రిగిన ప్యాచ్ వ‌ర్క్ తో షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటోంది.

ఈ మూవీ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటంటే…అక్టోబ‌ర్ 10న టీజ‌ర్ రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్న‌ట్టు స‌మాచారం. ఇక స్వ‌ర‌వాణి కీర‌వాణి సంగీత ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఆడియోను ద‌స‌రాకు గ్రాండ్ గా రిలీజ్ చేయాల‌నుకుంటున్నారు. వైవిధ్య‌మైన క‌థాంశంతో రూపొందుతోన్న ఈ భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ని న‌వంబ‌ర్ 2న రిలీజ్ చేయ‌నున్నారు. ప్రేమ‌మ్ త‌ర్వాత చైతు – చందు క‌లిసి చేస్తోన్న సినిమా కావ‌డంతో స‌వ్య‌సాచి పై ప్రారంభం నుంచి భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. మ‌రి…స‌వ్య‌సాచి ప్రేక్ష‌కాభిమానుల‌ను ఎంత వ‌ర‌కు ఆక‌ట్టుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here