Home Actor చైతు మాయ్యా..మాయ్యా..అంటూ మాయ చేస్తున్నాడుగా..!

చైతు మాయ్యా..మాయ్యా..అంటూ మాయ చేస్తున్నాడుగా..!

73
0


అక్కినేని నాగ చైతన్య, సమంత జంటగా న‌టించిన తాజా చిత్రం మ‌జిలీ. నిన్నుకోరి ఫేమ్ శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ విభిన్న ప్రేమ‌క‌థా చిత్రాన్ని ఏప్రిల్ 5వ తేదీన భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ టీజ‌ర్ & సాంగ్స్ కు అనూహ్య‌మైన స్పంద‌న ల‌భించింది. తాజాగా ఈ సినిమాలోని మాయ్యా .. మాయ్యా… అనే వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. గోపీ సుంద‌ర్ సంగీత ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ పాట‌కు భాస్క‌ర‌భ‌ట్ల సాహిత్యం అందించారు.

ఇక పాట విష‌యానికి వ‌స్తే… చైతు పాత్ర స్వరూప స్వభావాలను ఈ పాట ద్వారా ఆవిష్కరించారనే చెప్పాలి. చైతు తన స్నేహితులతో కలిసి ఆడిపాడే దృశ్యాలతో రూపొందిన‌ ఈ పాట విశేషంగా ఆక‌ట్టుకుంటుంది. దివ్యాన్ష కౌశిక్ మరో కథానాయికగా నటించింది. ఈ సినిమాకి ప్రారంభం నుంచి పాజిటివ్ టాక్ ఉంది. దీనికి తోడు పాట‌ల‌న్నీ సూపర్ స‌క్స‌స్ అవ్వ‌డంతో మ‌రిన్ని అంచ‌నాలు పెరిగాయి. చైత‌న్య – స‌మంత పెళ్లి త‌ర్వాత జంట‌గా న‌టించిన సినిమా కావ‌డంతో ఎప్పుడెప్పుడు ఈ సినిమాని చూస్తామా అని అభిమానులు ఆస‌క్తితో ఎదురు చూస్తున్నారు. మ‌రి..ఏప్రిల్ 5న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న మ‌జిలీ అంచ‌నాల‌కు అందుకుని ఏరేంజ్ స‌క్స‌స్ సాధిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here