Home Actor చైతు – మేర్ల‌పాక గాంధీ ప్రాజెక్ట్ ఉందా..? లేదా..?

చైతు – మేర్ల‌పాక గాంధీ ప్రాజెక్ట్ ఉందా..? లేదా..?

38
0
చైతు - మేర్ల‌పాక గాంధీ ప్రాజెక్ట్ ఉందా..? లేదా..? spiceandhra

యువ స‌మ్రాట్ నాగ చైత‌న్య మ‌జిలీ సినిమాతో బ్లాక్ బ‌ష్ట‌ర్ సాధించి సెన్సేష‌న్ క్రియేట్ చేసిన విష‌యం తెలిసిందే. ఈ సినిమా స‌క్స‌స్ ఇచ్చిన జోష్ తో వ‌రుస‌గా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్ర‌స్తుతం నాగ చైత‌న్య.. మేన‌మామ విక్ట‌రీ వెంక‌టేష్ తో క‌లిసి వెంకీ మామ సినిమా చేస్తున్నారు. జై ల‌వ‌కుశ ఫేమ్ బాబీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ క్రేజీ మూవీని సురేష్ ప్రొడ‌క్ష‌న్స్, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ద‌స‌రాకి ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది.

ఇక‌ శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో న‌టించ‌నున్న సినిమా సెప్టెంబ‌ర్ లో స్టార్ట్ కానుంది. ఈ సినిమా డిసెంబ‌ర్ లో రిలీజ్ కానుంది. ఆత‌ర్వాత నాగార్జున‌తో క‌లిసి సోగ్గాడే చిన్ని నాయ‌నా సీక్వెల్ బంగార్రాజులో న‌టించ‌నున్నాడు. అలాగే దిల్ రాజు బ్యాన‌ర్ లో నూత‌న ద‌ర్శ‌కుడు శ‌శితో ఓ సినిమా చేయాలి. ఇదిలా ఉంటే… చైత‌న్య‌తో మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌క‌త్వంలో యు.వి.క్రియేష‌న్స్ ఓ సినిమా ప్లాన్ చేస్తుంద‌ట‌.

ఈ సినిమా గురించి గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి కానీ.. ఈ ప్రాజెక్ట్ ఉందా..?  లేదా..?  అనేది క్లారిటీ లేదు. తాజాగా మ‌రోసారి ఈ ప్రాజెక్ట్ వార్త‌ల్లోకి వ‌చ్చింది. చైత‌న్య డేట్స్ సెట్ కాక‌పోతే మెగా హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ తో ఈ సినిమా చేయాల‌నుకుంటున్నార‌ని టాక్ వినిపిస్తుంది. మ‌రి.. ప్ర‌చారంలో ఉన్న ఈ వార్త నిజ‌మా..?  కాదా..?  అనేది తెలియాల్సివుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here