Home Telugu చైతు రెండు సినిమాల మ‌ధ్య పోటీ. అస‌లు ఏం జ‌రుగుతోంది..?

చైతు రెండు సినిమాల మ‌ధ్య పోటీ. అస‌లు ఏం జ‌రుగుతోంది..?

225
0
Savyasachi vs Sailaja reddy alludu

అక్కినేని నాగ చైత‌న్య న‌టించిన‌ స‌వ్య‌సాచి, శైల‌జారెడ్డి అల్లుడు ఈ రెండు సినిమ‌లు దాదాపుగా పూర్త‌వ్వ‌డంతో రిలీజ్ డేట్ విష‌యంలో ఈ రెండు సినిమాల నిర్మాణ సంస్థ‌ల మ‌ధ్య గ‌ట్టి పోటీ ఏర్ప‌డింది. స‌వ్య‌సాచి చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మిస్తుంటే…శైల‌జారెడ్డి అల్లుడు సినిమాను సితార ఎంట‌ర్ టైన్మెంట్ సంస్థ నిర్మిస్తోంది. స‌వ్య‌సాచికి ప‌ది రోజుల షూటింగ్ చేయాల్సివుంది. శైల‌జారెడ్డి అల్లుడు ఈ నెల 20కి షూటింగ్ కంప్లీట్ అవుతుంది.

శైల‌జారెడ్డి అల్లుడు సినిమాని ఆగ‌ష్టు 31న రిలీజ్ చేయాల‌ని ముందుగానే ఫిక్స్ అయ్యారు. అయితే..స‌వ్య‌సాచి కూడా ఆగ‌ష్టులో రిలీజ్ కి రెడీ అవుతోంది. దీంతో ఈ సినిమాల ఫ‌స్ట్ లుక్ & టీజ‌ర్ రిలీజ్ విష‌యంలో ఈ రెండు నిర్మాణ సంస్థ‌లు పోటీప‌డుతున్నాయి. ఇటీవ‌ల శైల‌జారెడ్డి అల్లుడు ఫ‌స్ట్ లుక్ అంటూ ఓ స్టిల్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇది సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది. ఆత‌ర్వాత ఈ స్టిల్ తో మాకు ఎలాంటి సంబంధం లేదు. త్వ‌ర‌లోనే ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేయ‌నున్న‌ట్టు నిర్మాణ సంస్థ క్లారిటీ ఇచ్చింది.

శైల‌జారెడ్డి అల్లుడు టీమ్ ఫ‌స్ట్ లుక్ రిలీజ్ ప్లాన్ చేస్తుంటే…స‌వ్య‌సాచి టీమ్ టీజ‌ర్ రిలీజ్ ప్లాన్ చేస్తుంది. ఈనెల 10 నుంచి ఓ ప‌ది రోజులు డేట్స్ ఇస్తే షూటింగ్ కంప్లీట్ చేస్తామంటుంది స‌వ్య‌సాచి టీమ్. అయితే…శైల‌జారెడ్డి అల్లుడు టీమ్ మాత్రం చైతు ఈనెల 20 వ‌ర‌కు మాకు డేట్స్ ఇచ్చారు. స‌వ్య‌సాచికి ఎలా డేట్స్ ఇస్తారని అడుగుతున్నారు.  దీంతో ఈ స‌మ‌స్య ప‌రిష్కారం కోసం నాన్న‌తో మాట్లాడండి అని మైత్రీ మూవీ మేక‌ర్స్ కి చైతు చెప్పాడ‌ట‌. ఇప్ప‌టి వ‌ర‌కు ఆగ‌ష్టు 17న స‌వ్య‌సాచి, ఆగ‌ష్టు 31న శైల‌జారెడ్డి అల్లుడు రిలీజ్ కానున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ రెండు సినిమాల మ‌ధ్య గ్యాప్ ఎక్కువ ఉంటే చైతు కెరీర్ కి మంచిది. మ‌రి…నాగ్ ఈ స‌మ‌స్య‌ను ఎలా ప‌రిష్క‌రిస్తారో..?  స‌వ్య‌సాచి, శైలజారెడ్డి అల్లుడు ఎప్పుడు ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తాయో చూడాలి..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here