Home Movie News చైతు శైల‌జారెడ్డి అల్లుడు ట్రైల‌ర్ అదిరింది..!

చైతు శైల‌జారెడ్డి అల్లుడు ట్రైల‌ర్ అదిరింది..!

133
0
Sailajareddy alludu trailor

అక్కినేని నాగ చైత‌న్య – మారుతి కాంబినేష‌న్లో రూపొందిన ఫ్యామిలీ ఎంట‌ర్ టైనర్ శైల‌జారెడ్డి అల్లుడు. సితార ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై రూపొందిన ఈ చిత్రాన్ని నాగ వంశీ నిర్మించారు. చైతు స‌ర‌స‌న అను ఇమ్మాన్యుయేల్ న‌టిస్తే..అత్త‌గా ర‌మ్య‌కృష్ణ న‌టించారు. సెప్టెంబ‌ర్ 13న ఈ చిత్రాన్ని భారీ స్ధాయిలో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ఈ మూవీ ట్రైల‌ర్ ను ఈరోజు నాగ చైత‌న్య ట్విట్ట‌ర్ ద్వారా రిలీజ్ చేసారు.

ఇక ట్రైల‌ర్ విష‌యానికి వ‌స్తే…నా పేరు చైత‌న్య ముద్దుగా అంద‌రూ చైతు అంటారు అని చైత‌న్య చెప్ప‌డంతో ట్రైల‌ర్ స్టార్ట్ అవుతుంది. దేనినైనా పాజిటివ్ గా తీసుకునే సాఫ్ట్ కేండిట్ ని… మ‌నం లైఫ్ లో ప్రేమించే ప్ర‌తి దాని వెన‌క ఒక క‌ష్టం ఉంటుంది. అది మ‌నం త‌ట్టుకోగ‌లిగితే లైఫ్ చాలా క‌ల‌ర్ ఫుల్ గా ఉంట‌ది అంటూ చైతు త‌న క్యారెక్ట‌ర్ ఎలా ఉంటుందో చెప్పేసాడు.

ఇక చైతు ప్రేమించిన అమ్మాయి అను, అత్త‌కి బాగా ఈగో ఎక్కువ‌. వీరిద్ద‌రి మ‌ధ్య ఈ సాఫ్ట్ కేండిట్ ఎలా నెగ్గుకురాగ‌లిగాడు అనేదే క‌థ‌. చారి పాత్రలో వెన్నెల కిషోర్ .. మాణిక్యం పాత్రలో పృథ్వీ కామెడీ ఆడియ‌న్స్ ని ఆక‌ట్టుకునేలా ఉంది. ట్రైల‌ర్ కు మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. మ‌రి…సినిమా కూడా అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగా విజ‌యం సాధిస్తుంద‌ని ఆశిద్దాం.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here