Home News Movie News చైతు సంతోష‌మే నాకు ముఖ్యం – స‌మంత‌..!

చైతు సంతోష‌మే నాకు ముఖ్యం – స‌మంత‌..!

15
0
Samantha-Latest-still-2

అక్కినేని స‌మంత న‌టించిన తాజా చిత్రం యూట‌ర్న్. ఈ చిత్రంలో స‌మంత జ‌ర్న‌లిస్ట్ గా న‌టించగా, భూమిక చావ్లా, ఆది పినిశెట్టి, రాహుల్ ర‌వీంద్ర‌న్ కీల‌క పాత్ర‌లు పోషించారు. వైవిధ్య‌మైన క‌థాంశంతో రూపొందిన యూట‌ర్న్ ఈ నెల 13న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది. ఈ సంద‌ర్భంగా స‌మంత మాట్లాడుతూ…యూట‌ర్న్ ఒరిజిన‌ల్ మూవీ చూసిన వెంట‌నే నాకు బాగా న‌చ్చింది. తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఈ సినిమా చూపించాలి అనిపించింది. అందుకే ఈ సినిమా చేసాను. అలాగే ఈ సినిమా డైరెక్ట‌ర్ ప‌వ‌న్ గారితో ఎప్ప‌టి నుంచో వ‌ర్క్ చేయాల‌నుకుంటున్నాను. అది ఇప్ప‌టికి నెర‌వేరింది.

ఇక చైత‌న్య శైల‌జారెడ్డి అల్లుడు సినిమాతో పోటీ గురించి మాట్లాడుతూ…లోప‌ల కొంచెం టెన్ష‌న్ ఉంది. ఎప్పుడూ మా ఇద్ద‌రి సినిమాలు ఒకేసారి రిలీజ్ చేయాలి అనుకోలేదు. కానీ..అనుకోకుండా ఇలా జ‌రిగింది. రెండు సినిమాలు సూప‌ర్ హిట్ అవ్వాల‌ని కోరుకుంటున్నాను. వ్య‌క్తిగ‌తంగా అయితే..చైత‌న్య సినిమా శైల‌జారెడ్డి అల్లుడు పెద్ద హిట్ అవ్వాలి అనుకుంటున్నాను. చైత‌న్య సంతోషం కంటే నాకు ఏదీ ఎక్కువ కాదు అని చెప్పింది. ప్ర‌స్తుతం చైత‌న్య‌తో క‌లిసి శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తున్నాను. త్వ‌ర‌లోనే నేను చేయ‌నున్న బిగ్ ప్రాజెక్ట్ ను ప్ర‌క‌టిస్తాన‌న్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here