Home Movie News చైతు స‌వ్య‌సాచి టీజ‌ర్ రిలీజ్ డేట్ ఫిక్స్.!

చైతు స‌వ్య‌సాచి టీజ‌ర్ రిలీజ్ డేట్ ఫిక్స్.!

96
0
DjXYmR4UYAAeVIt

అక్కినేని నాగ చైత‌న్య – ప్రేమ‌మ్ ఫేమ్ చందు మొండేటి కాంబినేష‌న్ లో రూపొందుతోన్న భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ స‌వ్య‌సాచి. ఈ భారీ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మిస్తుంది. చైత‌న్య స‌ర‌స‌న నిధి అగ‌ర్వాల్ న‌టిస్తోంది ఈ చిత్రంలో మాధ‌వ‌న్, భూమిక కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఇటీవ‌ల ఈ చిత్రం కోసం అల్ల‌రి అల్లుడు సినిమాలోని నిన్ను రోడ్డు మీద చూసిన‌ది ల‌గాయితు.. అనే సాంగ్ రీమిక్స్ చేసారు. ఈ పాట‌ను చైతు, నిధి అగ‌ర్వాల్ పై చిత్రీక‌రించారు.

గురువారంతో ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకుని… ప్ర‌జెంట్ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటోంది. ఈ మూవీ లేటెస్ట్ న్యూస్ ఏంటంటే…ఇందులో చైత‌న్య పాత్ర పేరు అర్జునుడు. ఇది చైత‌న్య గ‌త చిత్రాల‌కు పూర్తి భిన్నంగా ఉంటుంద‌ట‌. ఈ మూవీ టీజ‌ర్ ను అక్టోబ‌ర్ 10న రిలీజ్ చేయ‌నున్నార‌ని తెలిసింది. స్వ‌ర‌వాణి కీర‌వాణి సంగీతం అందిస్తోన్న స‌వ్యసాచి ఆడియోను అక్టోబ‌ర్ నెలాఖ‌రున రిలీజ్ చేయ‌నున్నారు. ఈ స్టైలీష్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ని న‌వంబ‌ర్ 2న భారీ స్ధాయిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here