Home Movie News చైతు స‌వ్య‌సాచి ఫ‌స్ట్ సాంగ్ సూప‌ర్..!

చైతు స‌వ్య‌సాచి ఫ‌స్ట్ సాంగ్ సూప‌ర్..!

100
0
DpCzKZLV4AAZGDT

అక్కినేని నాగ చైత‌న్య – ప్రేమ‌మ్ ఫేమ్ చందు మొండేటి కాంబినేష‌న్ లో రూపొందుతోన్న భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ స‌వ్య‌సాచి. మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. చైత‌న్య స‌ర‌స‌న నిధి అగ‌ర్వాల్ న‌టిస్తోంది. మాధ‌వ‌న్, భూమిక కీల‌క పాత్ర‌లు పోషించారు. ఈ చిత్రానికి స్వ‌ర‌వాణి కీర‌వాణి సంగీతం అందిస్తుండ‌డం విశేషం. ఈరోజు ఈ చిత్రంలోని వై నాట్ అనే సాంగ్ ను చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ ట్విట్ట‌ర్ ద్వారా రిలీజ్ చేసారు.

మనకిక్కడ చేదైన తీపౌతుందోయ్…మన ఇద్దరి బాధైనా హాయ్ అవుతుందోయ్….నిన్ను విడిచిన నిమిషం నుంచి నిన్ను మ‌ర‌చిన క్ష‌ణ‌మే లేదు..అనంత శ్రీరామ్ రాసిన ఈ పాట‌కు స్వ‌ర‌వాణి సంగీతం కీర‌వాణి సంగీతం అందించ‌డంతో ఈ పాట విన్న వెంట‌నే న‌చ్చేస్తుంది.. వినే కొద్దీ మ‌ళ్లీ మ‌ళ్లీ వినాల‌నిపిస్తుంది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటోంది. వైవిధ్య‌మైన క‌థాంశంతో ఈ సినిమా రూపొంద‌డం..టీజ‌ర్ కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ రావ‌డంతో సినిమా పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.

ఈ నెలాఖ‌రున ఆడియో ఫంక్ష‌న్ ను గ్రాండ్ గా చేసేందుకు మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ ప్లాన్ చేస్తుంది. భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందిన ఈ సినిమాను న‌వంబ‌ర్ 2న వ‌ర‌ల్డ్ వైడ్ గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మ‌రి..అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగానే స‌వ్య‌సాచి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుంద‌ని ఆశిద్దాం.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here