Home Telugu చైతు స‌వ్య‌సాచి రిలీజ్ డేట్..!

చైతు స‌వ్య‌సాచి రిలీజ్ డేట్..!

117
0
Savyasachi release date

అక్కినేని నాగ చైత‌న్య హీరోగా ప్రేమ‌మ్ ఫేమ్ చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం స‌వ్య‌సాచి. మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమా స‌మ్మ‌ర్ లో ప్రేక్ష‌కుల ముందుకు రావాల్సింది. కానీ..షూటింగ్ & గ్రాఫిక్స్ వ‌ర్క్ కంప్లీట్ కాక‌పోవ‌డం వ‌ల‌న వాయిదా ప‌డింది. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లో నాగ చైత‌న్య‌, మాధ‌వ‌న్, భూమిక‌ల పై కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. ఆగ‌ష్టు ఫ‌స్ట్ వీక్ కి షూటింగ్ మొత్తం పూర్తవుతుంది.

ఆగ‌ష్టు 31న శైల‌జారెడ్డి అల్లుడు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమాతో పాటు స‌వ్య‌సాచి కూడా ఆగ‌ష్టు 31న రిలీజ్ కి రెడీ అవుతుండ‌డంతో  ఈ రెండింటిలో ఏ సినిమా ఆగ‌ష్టు 31న రానుంది అనేది ఆస‌క్తిగా మారింది. అయితే…ఇటీవ‌ల నాగ్, చైత‌న్య‌ల‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్ మీటింగ్ జ‌రిగింద‌ని..స‌వ్య‌సాచి చిత్రాన్ని సెప్టెంబ‌ర్ 28న రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నార‌ని ఓ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది.

లేటెస్ట్ న్యూస్ ఏంటంటే…నాగార్జున దేవ‌దాస్ చిత్రాన్ని సెప్టెంబర్ 27న రిలీజ్ అవుతుంది కాబ‌ట్టి సవ్య‌సాచి సెప్టెంబ‌ర్ 28న రిలీజ్ చేయ‌డం క‌రెక్ట్ కాద‌ని.. సెప్టెంబ‌ర్ 7న స‌వ్య‌సాచి రిలీజ్ చేయాల‌నుకుంటున్నార‌ట‌. త్వ‌ర‌లోనే రిలీజ్ డేట్ అఫిషియ‌ల్ గా ఎనౌన్స్ చేస్తార‌ని స‌మాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here