Home Movie News చైతు స‌వ్య‌సాచి లేటెస్ట్ అప్ డేట్..?

చైతు స‌వ్య‌సాచి లేటెస్ట్ అప్ డేట్..?

118
0
Savyasachi

అక్కినేని నాగ‌చైత‌న్య – ప్రేమ‌మ్ ఫేమ్ చందు మొండేటి కాంబినేష‌న్ లో రూపొందుతోన్న భారీ చిత్రం స‌వ్య‌సాచి. మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తుంది. చైత‌న్య స‌ర‌స‌న నిథి అగ‌ర్వాల్ న‌టిస్తుంటే…భూమిక‌, మాధ‌వ‌న్ కీల‌క పాత్ర‌లు పోషించారు. ఈ మూవీ ఎప్పుడో రిలీజ్ కావాలి కానీ..గ్రాఫిక్స్ వ‌ర్క్ కంప్లీట్ కాక‌పోవ‌డం వ‌ల‌న పోస్ట్ పోన్ అయ్యింది. చైతు – చందు కాంబినేష‌న్ లో రూపొందిన ప్రేమ‌మ్ సూప‌ర్ హిట్ కావ‌డం.. వీరిద్ద‌రు క‌లిసి ఈసారి యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ చేస్తుండ‌డంతో స‌వ్య‌సాచి పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.

ఈ మూవీ అప్ డేట్ ఏంటంటే…అల్ల‌రి అల్లుడు సినిమాలో నాగార్జున‌, రమ్య‌కృష్ణ ల‌పై చిత్రీక‌రించిన నిన్ను రోడ్డు మీద చూసిన‌ది ల‌గాయితూ..అనే సాంగ్ ను ఈ మూవీ కోసం రీమిక్స్ చేసారు. ఈ పాట‌ను చైత‌న్య‌, త‌మ‌న్నా ల‌పై చిత్రీక‌రించాలి అనుకున్నారు కానీ..చైత‌న్య‌, నిధి అగ‌ర్వాల్ పై చిత్రీక‌రించిన‌ట్టు స‌మాచారం. ఈ సాంగ్ చిత్రీక‌ర‌ణ‌తో షూటింగ్ పూర్త‌య్యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటోంది. స్వ‌ర‌వాణి కీర‌వాణి సంగీతం అందిస్తున్నారు. బాహుబ‌లి చిత్రానికి వ‌ర్క్ చేసిన మ‌కుట సంస్థే ఈ చిత్రానికి కూడా గ్రాఫిక్స్ వ‌ర్క్ చేస్తుండ‌డం విశేషం. ఈ భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ని న‌వంబ‌ర్ 2న రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here