Home Actor చైత‌న్య – దిల్ రాజు మూవీలో హీరోయిన్ ఎవ‌రో తెలుసా..?

చైత‌న్య – దిల్ రాజు మూవీలో హీరోయిన్ ఎవ‌రో తెలుసా..?

98
0

అక్కినేని నాగ చైత‌న్య ప్ర‌స్తుతం వెంకీ మామ సినిమా చేస్తున్నారు. బాబీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ భారీ క్రేజీ మ‌ల్టీస్టార‌ర్ ఈ నెల 20 నుంచి కాశ్మీర్ లో షూటింగ్ జ‌రుపుకోనుంది. ఈ సినిమా త‌ర్వాత చైత‌న్య దిల్ రాజు బ్యాన‌ర్ లో సినిమా చేయ‌నున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రానికి నూత‌న ద‌ర్శ‌కుడు శ‌శి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. ఈ సినిమా గురించి త్వ‌ర‌లోనే అఫిషియ‌ల్ ఎనౌన్స్ మెంట్ రానుంది.

అయితే…ఈ సినిమాలో నాగ చైత‌న్య స‌ర‌స‌న కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టించ‌నున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. వీర‌ద్దరు క‌లిసి ద‌డ చిత్రంలో న‌టించారు. అజయ్ భుయాన్ దర్శకత్వంలో రూపొదిన ఈ చిత్రం 2011లో విడుద‌లైంది. ఈ మూవీ మ్యూజిక‌ల్ హిట్ గా నిలిచింది. అయితే బాక్సాఫీస్ వ‌ద్ద ఫ్లాప్ అయ్యింది. త‌ర్వాత మ‌రో సినిమాలో వీరిద్ద‌రూ క‌లిసి న‌టించ‌నే లేదు. 8 ఏళ్ల త‌ర్వాత ఇద్ద‌రూ వెండితెర పై సంద‌డి చేయ‌బోతున్నారని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. మ‌రి..ప్ర‌చారంలో ఉన్న ఈ వార్త వాస్త‌వ‌మేనా..?  కాదా..?  అనేది తెలియాల్సివుంది..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here