Home Movie News చ‌ర‌ణ్ – బోయపాటి టైటిల్ విన‌య విధేయ రామ‌.

చ‌ర‌ణ్ – బోయపాటి టైటిల్ విన‌య విధేయ రామ‌.

108
0

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ – ఊర మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్ లో రూపొందుతోన్న భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. డీవీవీ దాన‌య్య నిర్మిస్తోన్న ఈ చిత్రానికి విన‌య విధేయ రామ టైటిల్ ఖ‌రారు చేయ‌నున్న‌ట్టు గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌చ్చాయి. ఆఖ‌రికి ప్ర‌చారంలో ఉన్న ఈ టైటిల్ నే ఖ‌రారు చేసారు. దీపావ‌ళి సంద‌ర్భంగా ఈ మూవీ టైటిల్ ను ట్విట్ట‌ర్ ద్వారా రిలీజ్ చేసారు. బోయ‌పాటి సినిమా అంటే ఎంత మాస్ గా ఉంటుందో తెలిసిందే.

దీనికి త‌గ్గ‌ట్టే టైటిల్ కూడా మాస్ గా ఉంటుంది అనుకున్నారు కానీ…బోయ‌పాటి గ‌త చిత్రానికి జ‌య జాన‌కి నాయ‌క అనే క్లాస్ టైటిల్ పెట్టిన‌ట్టే ఈ చిత్రానికి కూడా విన‌య విధేయ రామ క్లాస్ టైటిల్ పెట్టారు. టైటిల్ చూస్తే క్లాస్..చ‌ర‌ణ్ లుక్ చూస్తే మాస్. మొత్తానికి ఫ‌స్ట్ లుక్ బాగుంది. ఈ నెల 9న టీజ‌ర్ రిలీజ్ చేయ‌నున్నారు. ఇందులో చ‌ర‌ణ్ స‌ర‌స‌న కైరా అద్వానీ న‌టిస్తోంది. ప్ర‌స్తుతం షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉంది. సంక్రాంతి కానుక‌గా ఈ సినిమాని భారీ స్ధాయిలో రిలీజ్ చేయ‌నున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here