Home Movie News చ‌ర‌ణ్ – బోయ‌పాటి మూవీ ఫ‌స్ట్ లుక్ కి ముహుర్తం ఖ‌రారు..!

చ‌ర‌ణ్ – బోయ‌పాటి మూవీ ఫ‌స్ట్ లుక్ కి ముహుర్తం ఖ‌రారు..!

95
0

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ – ఊర మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్ లో రూపొందుతోన్న భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఈ చిత్రంలో చ‌ర‌ణ్ స‌ర‌స‌న కైరా అద్వానీ న‌టిస్తోంది. సీనియ‌ర్ హీరోలు ప్ర‌శాంత్, ఆర్య‌న్ రాజేష్ ముఖ్య పాత్ర‌లు పోష‌స్తున్నారు. ఇంకా 30 రోజులు షూటింగ్ చేయాల్సివుంది. అయితే…ద‌స‌రా రోజున ఈ మూవీ టైటిల్ & ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేస్తార‌ని ప్ర‌చారం జ‌రిగింది కానీ..రిలీజ్ చేయ‌లేదు.

లేటెస్ట్ న్యూస్ ఏంటంటే…దీపావ‌ళి కానుక‌గా ఈ మూవీ టైటిల్ & ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేస్తార‌ని తెలిసింది. ద‌స‌రాకి ఫ‌స్ట్ లుక్ రిలీజ్ కాక‌పోవ‌డంతో ఈ సినిమా గ‌తంలో ఎనౌన్స్ చేసిన‌ట్టుగా సంక్రాంతికి రావ‌డం లేద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది కానీ..సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 11న రిలీజ్ చేయ‌డం ఖాయం అని చిత్రియూనిట్ తెలియ‌చేసింది. భారీ చిత్రాల నిర్మాత డీవీవీ దాన‌య్య ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తోన్నఈ మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here