Home Movie News చ‌ర‌ణ్ – బోయ‌పాటి మూవీ ఫ‌స్ట్ లుక్ రిలీజ్ డేట్ ఫిక్స్.

చ‌ర‌ణ్ – బోయ‌పాటి మూవీ ఫ‌స్ట్ లుక్ రిలీజ్ డేట్ ఫిక్స్.

111
0

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ – ఊర మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్ లో రూపొందుతోన్న భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. డీవీవీ దాన‌య్య నిర్మిస్తోన్న ఈ సినిమాలో చ‌ర‌ణ్ స‌ర‌స‌న కైరా అద్వానీ న‌టిస్తోంది. చ‌ర‌ణ్ కి మాస్ లో ఎంత క్రేజ్ ఉందో ప్ర‌త్యేకించి చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ఇక చ‌ర‌ణ్ తో బోయ‌పాటి శ్రీను క‌లిస్తే ఆ మూవీ ఎలా ఉంటుందో..?  ఊహించుకోవ‌చ్చు. అందుక‌నే ఈ సినిమాని ఎనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుంచి భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.

అభిమానులు ఎప్పుడు ఈ సినిమాని చూస్తామా అని ఆస‌క్తితో ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ గురించి లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే… ఫస్ట్ లుక్ ను ఈ నెల 6వ తేదీన మధ్యాహ్నం 1 గంటకు విడుదల చేయనున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఇక ఇదే సమయంలో టీజర్ రిలీజ్ డేట్ ను కూడా ఖరారు చేసేశారు. ఈ నెల 9వ తేదీన ఉదయం 10:25 గంటలకు టీజర్ ను రిలీజ్ చేయ‌నున్నారు. ఈ సినిమా టైటిల్ గా వినయ విధేయ రామ అంటూ జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. అదే టైటిల్ ను ఖరారు చేస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here