Home Movie News చ‌ర‌ణ్ – బోయ‌పాటి మూవీ ఫ‌స్ట్ లుక్ రిలీజ్ డేట్ ఫిక్స్.!

చ‌ర‌ణ్ – బోయ‌పాటి మూవీ ఫ‌స్ట్ లుక్ రిలీజ్ డేట్ ఫిక్స్.!

114
0
Twist-in-Charan-s-project-with-Boyapati--1514888726-1697

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ – ఊర మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్ లో రూపొందుతోన్న భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. చ‌ర‌ణ్ స‌ర‌స‌న కైరా అద్వానీ న‌టిస్తోంది.  ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ యూర‌ప్ లోని అజ‌ర్ బైజాన్ అనే ప్లేస్ లో షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఈ షెడ్యూల్ లో భారీ యాక్ష‌న్ సీన్స్ ను చిత్రీక‌రిస్తున్నారు. రామ్ చ‌ర‌ణ్‌, వివేక్ ఒబ‌రాయ్ ల‌పై కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్న‌ట్టు స‌మాచారం.

డి.వి.వి. ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై దాన‌య్య నిర్మిస్తోన్న ఈ భారీ చిత్రంలో సీనియ‌ర్ హీరో ప్ర‌శాంత్, ఆర్య‌న్ రాజేష్ ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే..ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 19న ఈ మూవీ టీజ‌ర్ రిలీజ్ చేయ‌డానికి డేట్ ఫిక్స్ చేసిన‌ట్టు స‌మాచారం. మూవీని సంక్రాంతి కానుక‌గా రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. రామ్ చ‌ర‌ణ్ కి మాస్ లో ఎంత క్రేజ్ ఉందో ప్ర‌త్యేకించి చెప్ప‌న‌వ‌స‌రం లేదు. దీనికి తోడు ఊర మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి తోడైతే…ఆ సినిమా ఏరేంజ్ లో ఉంటుందో ఊహించుకోవ‌చ్చు. అందుక‌నే మెగా అభిమానులు ఎప్పుడెప్పుడు ఈ సినిమా వ‌స్తుందా అని ఎదురుచూస్తున్నారు. మ‌రి..చ‌ర‌ణ్ – బోయ‌పాటి కాంబినేష‌న్ ఎలాంటి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here