Home Movie News చ‌ర‌ణ్ – బోయ‌పాటి మూవీ రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత‌..!

చ‌ర‌ణ్ – బోయ‌పాటి మూవీ రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత‌..!

85
0

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ – ఊర మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్ లో రూపొందుతోన్న హై వోల్టేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఈ భారీ చిత్రాన్ని డీవీవీ ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై డీవీవీ దాన‌య్య నిర్మిస్తున్నారు. అయితే..ఈ చిత్రం షూటింగ్ పార్ట్ ఇంకా చాలా ఉండ‌డంతో సంక్రాంతికి రిలీజ్ కావ‌డం క‌ష్ట‌మే అంటూ టాక్ వినిపిస్తోంది. ప్ర‌చారంలో ఉన్న ఈ వార్త‌ల పై చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంట‌ర్ టైన్మెంట్స్ ట్విట్ట‌ర్ ద్వారా క్లారిటీ ఇచ్చింది.

వ‌చ్చే సంవ‌త్స‌రం సంక్రాంతికి ఈ చిత్రం విడుద‌ల చేయ‌నున్న‌ట్టు తెలియ‌చేసారు. అంతే కాకుండా ఫ‌స్ట్ లుక్ & టైటిల్ రిలీజ్ తేదీని అతి త్వ‌ర‌లో ఎనౌన్స్ చేస్తామ‌న్నారు. దీపావ‌ళి సంద‌ర్భంగా ఫ‌స్ట్ లుక్ & టైటిల్ రిలీజ్ చేయ‌నున్న‌ట్టు తెలిసింది. రామ్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న కైరా అద్వానీ న‌టిస్తున్న ఈ చిత్రంలో సీనియ‌ర్ హీరోలు ప్ర‌శాంత్, ఆర్య‌న్ రాజేష్ ముఖ్య‌పాత్ర‌లు పోషిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు.

Contrary to some rumors which are being circulated, #RC12 is on schedule to release for Sankranthi 2019. We will announce the first look details very soon.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here