Home Movie News చ‌ర‌ణ్ మూవీకి క్లాస్ టైటిల్ ఫిక్స్ చేసారా..?

చ‌ర‌ణ్ మూవీకి క్లాస్ టైటిల్ ఫిక్స్ చేసారా..?

90
0
Twist-in-Charan-s-project-with-Boyapati--1514888726-1697

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ – ఊర మాస్ డైరెక్ట‌ర్ బోయపాటిల క్రేజీ కాంబినేష‌న్ లో రూపొందుతోన్న భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఈ సినిమా ఎన్నో అంచ‌నాల‌తో సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది. అయితే…ఈ మూవీ టైటిల్ ఏంటి అనేది ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌క‌టించ‌లేదు కానీ…కొన్ని టైటిల్స్ ప్ర‌చారంలో వ‌చ్చాయి. అవి ఏంటంటే..మెగాస్టార్ చిరంజీవి న‌టించిన స్టేట్ రౌడీ టైటిల్ నే ఈ మూవీకి ఖ‌రారు చేసార‌ని టాక్ వ‌చ్చింది.

ఆత‌ర్వాత ఏమైందో ఏమో కానీ.. ఈసారి రెండు టైటిల్స్ ప్ర‌చారంలోకి వ‌చ్చాయి. అందులో ఒక‌టి మాస్ టైటిల్ అయితే..రెండోది క్లాస్ టైటిల్. ఇక‌ మాస్ టైటిల్ విషయానికొస్తే…రౌడీ తమ్ముడు అనే టైటిల్  వినిపిస్తోంది. స్టేట్ రౌడీ అనే టైటిల్ లో రౌడీకి, పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు టైటిల్ లింక్ చేసి పెట్టారని ఫిలింన‌గ‌ర్ టాక్. ఈ సినిమాలో చరణ్ ది ఇద్దరు అన్నలకు తమ్ముడి పాత్ర. అందుకే ఈ టైట‌ల్ ప‌రిశీలిస్తున్నార‌ని తెలిసింది.

ఇక క్లాస్ టైటిల్ విష‌యానికి వ‌స్తే.. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ సినిమాకు జయజానకి నాయక అనే పేరుపెట్టినట్టు, చరణ్ సినిమాకు క్లాసీగా వినయ విధేయ రామ అనే టైటిల్ ను బోయ‌పాటి  ఫిక్స్ చేశార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అంతే కాకుండా…చిత్ర నిర్మాత దానయ్య ఫిలిం ఛాంబ‌ర్ లో ఈ టైటిల్ రిజిష్ట‌ర్ చేయించార‌ని..అందుచేత దాదాపు ఈ టైటిల్ నే ఖ‌రారు చేయ‌నున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌రి..ప్ర‌చారంలో ఉన్న‌ట్టు ఈ టైటిల్ నే ఖ‌రారు చేస్తారో..లేక వేరే టైటిల్ పెడ‌తారో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here