Home Actor చ‌ర‌ణ్ విన‌య విధేయ రామ సెన్సార్ పూర్తి.

చ‌ర‌ణ్ విన‌య విధేయ రామ సెన్సార్ పూర్తి.

107
0

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చరణ్ – ఊర మాస్ డైరెక్ట‌ర్ బోయపాటి కాంబినేషన్లో రూపొందిన భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్  వినయ విధేయ రామ. డి.వి.వి. ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై దాన‌య్య ఈ భారీ చిత్రాన్ని నిర్మించారు. జనవరి 11వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ మూవీకి యు/ఎ సర్టిఫికేట్ ఇచ్చింది. చరణ్ యాక్షన్ .. కైరా గ్లామర్ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని అంటున్నారు.

బాలీవుడ్ యాక్ట‌ర్ వివేక్ ఒబెరాయ్ ఈ సినిమాలో విల‌న్ గా న‌టించారు. స్నేహా, ప్రశాంత్, ఆర్యన్ రాజేష్‌ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. చరణ్ గ‌త చిత్రం రంగస్థలం సంచలన విజయాన్ని సాధించడంతో..సహజంగానే ఈ సినిమా పై భారీ అంచనాలు వున్నాయి. సంక్రాంతికి ఈ సినిమాతో పాటు ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు, ర‌జ‌నీకాంత్ పేట‌, వెంకీ – వ‌రుణ్ ల ఎఫ్ 2 విడుదల కానున్నాయి. మ‌రి..ఈ నాలుగు చిత్రాల్లో ఏ సినిమా సంచ‌ల‌న విజ‌యాన్ని సాధిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here