Home News జనం లేక హైదరాబాదులో కేసీఆర్ సభ రద్దు..!

జనం లేక హైదరాబాదులో కేసీఆర్ సభ రద్దు..!

118
0


ఎల్బీ స్టేడియంలో టీఆర్‌ఎస్ ప్రచార సభ రద్దైంది. జనం లేక స్టేడియం వెలవెలబోవడంతో సభను రద్దు చేసినట్లు టీఆర్‌ఎస్ నేతలు ప్రకటించారు. సీఎం మిర్యాలగూడ సభలో ఉన్నప్పుడే జన సమీకరణ కాలేదని నేతలు సమాచారమిచ్చారు. అయితే 7:30 గంటల వరకైనా జన సమీకరణ చేయాలని నేతలను పురమాయించినట్లు సమాచారం. అయినా సరే.. జన సమీకరణలో నేతలు విఫలమయ్యారు.

 హైదరాబాద్ నగరానికి చెందిన నేతలు ఈ సభకు కనీసం 5 వేల మందిని కూడా తరలించలేకపోయారని సమాచారం. ఈ వైఫల్యం పై సీఎం కేసీఆర్ నేతల పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అక్కడికి వచ్చిన నేతలు తూతూ మంత్రంగానే ప్రసంగించారు. సభకు ఎవరూ రాకపోవడంతో.. సభకు హాజరు కాకపోవడమే మంచిదని భావించిన కేసీఆర్ బేగంపేట్ విమానాశ్రయం నుంచి నేరుగా ప్రగతి భవన్‌కి వెళ్లిపోయారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here