Home News జనసేన పార్టీ రాజమహేంద్రవరం అర్బన్ అసెంబ్లీ అభ్యర్థి అత్తి స‌త్య‌నారాయ‌ణ‌కి ఘ‌న స‌న్మానం..!

జనసేన పార్టీ రాజమహేంద్రవరం అర్బన్ అసెంబ్లీ అభ్యర్థి అత్తి స‌త్య‌నారాయ‌ణ‌కి ఘ‌న స‌న్మానం..!

77
0


తూర్పు గోదావరి జిల్లా ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఈ నెల‌ 19న‌ సాయంత్రం 5 గం.ల‌కు జనసేన పార్టీ రాజమహేంద్రవరం అర్బన్ అసెంబ్లీ అభ్యర్థిగా ఎన్నికైన అనుశ్రీ ఫిలింస్ అధినేత శ్రీ అత్తి సత్యనారాయణ గారికి ఘన సన్మానం జరిగినది. శ్రీ అత్తి సత్యనారాయణ గారు ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించాలని అసోసియేషన్ సభ్యులు ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఆయన విజయానికి అందరూ కృషి చేసి వెన్నుదన్నుగా నిలవడానికి నిర్ణయం తీసుకున్నారు.

అంతేకాక జిల్లా వ్యాప్తంగా ఉన్న అసోసియేషన్ పూర్తిగా జనసేన పార్టీకి మద్దతు ప్రకటించి విజయానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ఎస్ ఎన్ మూర్తి, ఉపాధ్యక్షులు అన్నపూర్ణ రాజు, కార్యదర్శి అంజి శ్వరరావు, కోశాధికారి చీకట్ల సత్యనారాయణ, కార్యవర్గ సభ్యులు సురేష్ మూవీస్ రమేష్, J.రాధాకృష్ణ, C.V.S.రామశాస్త్రి, జె.కె రామకృష్ణ, పి.హరిబాబు, వాడ్రేవు సతీష్, వి.గౌరీ శంకర్, M. ప్రసాద్, డి.సుబ్బరాజు, జి. స్వామి రాజు, సుందరo తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here