Home Actor జనసేన పాలనలో వ్యవసాయానికి ఊతమిస్తాం – ప‌వ‌న్ క‌ళ్యాణ్

జనసేన పాలనలో వ్యవసాయానికి ఊతమిస్తాం – ప‌వ‌న్ క‌ళ్యాణ్

76
0


జ‌న‌సేన ప్ర‌భుత్వంలో స్పెష‌ల్ అగ్రిక‌ల్చ‌ర‌ల్ జోన్స్ ఏర్పాటు చేసి వ్య‌వ‌సాయం మీద మ‌క్కువ ఉన్న యువ‌త‌కి ఉపాధి క‌ల్పిస్తామ‌ని జ‌న‌సేన అధ్య‌క్షులు శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ల‌క్ష‌ల ఎక‌రాల సాగు భూమి ఉన్నా, వ్య‌వ‌సాయానికి అనుకూల ప‌రిస్థితులు లేవ‌న్నారు. ఇజ్రాయిల్ త‌ర‌హా వ్య‌వ‌సాయ విధానాలు అమ‌ల్లోకి తెచ్చి, రెండు సంవ‌త్స‌రాల స‌మ‌యంలో నవతరం  రైతుల్ని త‌యారు చేస్తామ‌న్నారు. జ‌న‌సేన ఎన్నిక‌ల శంఖారావంలో భాగంగా గుంటూరు జిల్లా ప‌త్తిపాడులో నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌లో పాల్గొన్నారు.

స‌భ‌కి హాజ‌రైన ఆశేష జ‌న‌వాహిని ని ఉద్దేశించి శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ మాట్లాడుతూ… “యువ‌త‌కి ప‌రిశ్ర‌మ‌ల్లో ఉద్యోగాలు ఒక్క‌టే కాదు అవ‌స‌రం అయితే వ్య‌వ‌సాయం చేసయినా వారి కాళ్ల మీద వారు నిల‌బ‌డే ప‌రిస్థితులు క‌ల్పించాలి. అందుకోసం ప్ర‌త్యేక జోన్లు ఏర్పాటు చేసి, ఎక్క‌డ ఎలాంటి తోట‌లు పెంచాల‌ని, పండిన పంట‌కి మార్కెటింగ్ అవ‌కాశాలు ఎక్క‌డ ఉంటాయి అనే అంశాల‌కు ప్రాధాన్య‌త ఇస్తాం. 500 ఎక‌రాల్ని ఒక జోన్‌గా ఏర్పాటు చేసి, ఒక్కొక్క‌రికీ 2 వేల గ‌జాల చొప్పున యువ‌త‌కి అప్ప‌గిస్తాం.

మీరు వ్య‌వ‌సాయం చేయ‌గ‌లిగిన‌న్ని రోజులు ఆ భూమిలో పంట‌ను పండించుకోవ‌చ్చు. అందుకే జ‌న‌సేన మ్యానిఫెస్టోలో స్పెష‌ల్ అగ్రిక‌ల్చ‌ర‌ల్ జోన్స్ అనే ప‌దాన్ని పెట్టాం. యువ‌త శ‌క్తి సామ‌ర్ధ్యాలు నిష్ఫ‌లం కాకుండా, ఓ 25 వేల మందికి 6 నుంచి 9 నెల‌ల పాటు ట్రైనింగ్ ఇచ్చి స్పెష‌ల్ పోలీస్ క‌మాండోలుగా నియ‌మిస్తాం. స‌మాజంలో శాంతి భ‌ద్ర‌త‌ల ప‌రిర‌క్ష‌ణ అనే అంశాన్ని జ‌న‌సేన పార్టీ ప్రాధాన్య‌త ఇస్తుంది. అదే స‌మ‌యంలో కుల‌, మ‌తాల‌కి అతీతంగా అంద‌రికీ స‌మాన అవ‌కాశాలు క‌ల్పిస్తుంది. జ‌న‌సేన ప్ర‌భుత్వం ఏర్పాటైన 18 నెల‌ల్లో గుంటూరు కెనాల్ ప‌నులు పూర్తి చేసి ప‌త్తిపాడు సాగునీటి స‌మ‌స్య తీరుస్తాం. డ్రైనేజ్ ప్రాజెక్టు సాధ్య‌మైనంత త్వ‌ర‌గా పూర్తి చేస్తాం. ప్ర‌తి మూడు నెల‌ల‌కి ఒకసారి ఎన్నిక‌ల హామీల‌కి సంబంధించి పొలిటికల్ ఆడిట్ నిర్వ‌హించి, ఇప్ప‌టి వ‌ర‌కు ఏం చేశాం, ఏం చేయ‌లేక‌పోయాం, అనే అంశాల‌ను ప్ర‌జ‌ల ముందు ఉంచుతాం. హామీలు నెర‌వేర్చే క్ర‌మంలో అవ‌స‌రం అయితే ప్ర‌జ‌ల స‌ల‌హాలు, సూచ‌న‌లు తీసుకుంటాం.

* 3 లక్షల ఉద్యోగాలు కల్పన

జ‌న‌సేన పార్టీ ప్రారంభించే స‌మ‌యంలో నన్ను బాధించిన అంశాల్లో అన్న‌దాత‌లు దుస్థితి కూడా ఉంది. అందుకే రైతులు క‌న్నీరుపెట్ట‌ని  గ్రామీణ భార‌తాన్ని నేను క‌ల‌గ‌న్నాను. అందుకే ముఖ్య‌మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మ‌రుక్ష‌ణ‌మే నా మొద‌టి సంత‌కాన్ని రైతుల‌కి నెల‌కి రూ. 5 వేల ఫించ‌న్ ఇచ్చే ప‌థ‌కం మీద పెట్టాల‌ని నిర్ణ‌యించుకున్నా. దీంతో పాటు ఎలాంటి హామీ ప‌త్రాలు లేకుండా రైతులంద‌రికీ ఏడాదికి ఎక‌రానికి రూ. 8 వేల చొప్పున సాగు సాయం అంద‌చేస్తాం. కుటుంబ స‌భ్యుల సంఖ్య ఆధారంగా, ఆదాయంతో సంబంధం లేకుండా ఆడ‌ప‌డుచుల‌కు ఉచిత గ్యాస్ అందించే  ప‌థ‌కం మీద రెండో సంత‌కం చేస్తాం. ఏడాదికి ఆరు నుంచి ప‌ది సిలిండ‌ర్లు ఉచితంగా జ‌న‌సేన ప్ర‌భుత్వం అంద‌చేస్తుంది. త‌దుప‌రి సంత‌కం రేష‌న్ బియ్యం, ప‌నికిరాని పామాయిల్‌తో ఇబ్బందులు ప‌డుతున్న మీ కోసం రేష‌న్‌కి బ‌దులు రూ. 2500 నుంచి రూ. 3500 వంద‌లు మ‌హిళ‌ల ఖాతాల‌కి జ‌మ చేసే ప‌థ‌కం పై పెడ‌తాను.

రాజ‌కీయ ద‌ళారీ వ్య‌వ‌స్థ వ‌ల్ల ప్ర‌భుత్వ ప‌థ‌కాలు నేరుగా ప్ర‌జ‌ల‌కి అంద‌డం లేదు. అందుకే మీ ఖాతాల్లోకి  నేరుగా డ‌బ్బు జ‌మ చేసి మీరు తినే తిండిపై నిర్ణ‌యం మీరే తీసుకునే అవ‌కాశం క‌ల్పిస్తాం. యువ‌త కోసం ఆరు నెల‌ల్లో మూడు ల‌క్ష‌ల ప్ర‌భుత్వ ఉద్యోగాలు భ‌ర్తీ చేసే బాధ్య‌త జ‌న‌సేన పార్టీ తీసుకుంటుంది. ల‌క్ష‌ల కోట్లు దోచుకోవ‌డానికి డ‌బ్బు ఉన్న‌ప్పుడు చ‌దువుకున్న యువ‌త‌కి ఉద్యోగాలు ఇవ్వ‌డానికి డ‌బ్బు ఎందుకు ఉండ‌దు.?  ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటు ద్వారా మ‌రో ప‌ది ల‌క్ష‌ల ఉద్యోగాలు క‌ల్పించే అంశానికి సంబంధించి పాల‌సీలు రూపొందిస్తున్నాం. జ‌న‌సేన ప్ర‌భుత్వంలో విద్యార్ధులు ఎలాంటి ఫీజులు చెల్లించ‌కుండా చ‌దువుకునే అవ‌కాశం క‌ల్పిస్తాం. ఉచిత క్యాంటిన్లు ఏర్పాటు చేస్తాం. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు గారిలా రోడ్ల మీద కూర్చుని తిర‌గండి చివ‌రి రెండు నెల‌ల్లో రూ. 2500 ఇచ్చి ఓట్లు కొంటాను అనే ర‌కం కాదు నేను. మీకు 25 ఏళ్ల భ‌విష్య‌త్తు ఇవ్వ‌డానికి జ‌న‌సేన ఉంది అని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here