Home Actor జీవా `కీ` మూవీ స్టోరీ ఇదే.!

జీవా `కీ` మూవీ స్టోరీ ఇదే.!

86
0


రంగం సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన హీరో జీవా క‌థానాయ‌కుడిగా సైబ‌ర్ క్రైమ్ నేప‌థ్యంలో రూపొందుతోన్న సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ `కీ`. నిక్కి గ‌ల్రాని, అనైక సోఠీ హీరోయిన్స్‌గా న‌టించారు. రాజేంద్ర‌ప్ర‌సాద్‌, సుహాసిని కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. కలీస్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. కృష్ణ క్రియేష‌న్స్‌, ల‌క్ష్మీ వెంక‌టేశ్వ‌ర మూవీస్ బేన‌ర్స్ నిర్మాణంలో సినిమా తెలుగులో విడుద‌ల‌వుతుంది. ఈ నెల‌ 12న తెలుగు, త‌మిళ భాష‌ల్లో `కీ` చిత్రం విడులకు సిద్ధ‌మైంది.

ఇక ఈ చిత్ర క‌థ విష‌యానికి వ‌స్తే…టెక్నాలజీ ఎక్కువ అవుతున్న ఈ రోజుల్లో..ఉప‌యోగం ఎంత ఉంటుందో, న‌ష్టం కూడా అంతే ఉంటుంది. కంప్యూట‌ర్‌ను హ్యాక్ చేసి ఎదుటివారిని బెదిరిస్తుంటారు. ఆ న‌ష్టం ఎంతంటే ఎదుటివారు ప్రాణాలు తీసుకునేంత‌గా. అలాగే రీసెంట్ టైమ్స్‌లో బ్లూవేల్ గేమ్ వార్త‌ను మ‌నం త‌రుచూ చ‌దువుతూనే ఉన్నాం.

ఈ బ్లూవేల్ గేమ్ ఆడి ఎంతో మంది యువ‌త బ‌ల‌వంతంగా త‌మ ప్రాణాల‌ను తామే తీసుకుంటున్నారు. ఇలాంటి ప్ర‌మాద‌క‌ర‌మైన బ్లూవేల్ గేమ్ కూడా ఈ సాంకేతిక‌త‌లో భాగంగానే ఉంది. కానీ ఇటువంటి బ్లూవేల్ కంటే ప్ర‌మాద‌క‌ర‌మైన ఆట‌ను మ‌నం అంద‌రం ఆడుతున్నాం. అదేంటో తెలుసుకోవాలంటే… ఈ నెల‌ 12 వ‌ర‌కు ఆగాల్సిందే. ఎందుకంటే అన్నీ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న`కీ` చిత్రాన్ని ఈ నెల 12న విడుద‌ల చేస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here