Home Actor జెర్సీ రివ్యూ..!

జెర్సీ రివ్యూ..!

221
0

నాని న‌టించిన తాజా చిత్రం జెర్సీ. మ‌ళ్లీ రావా ఫేమ్ గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ వైవిధ్య‌మైన చిత్రాన్ని సితార ఎంట‌ర్ టైన్మెంట్స్ సంస్థ నిర్మించింది. క్రికెట్ నేప‌ధ్యంలో సాగే జెర్సీ మూవీని ఎనౌన్స్  చేసిన‌ప్ప‌టి నుంచి పాజిటివ్ టాక్ ఏర్ప‌డింది. దీనికి తోడు టీజర్ & ట్రైల‌ర్ కి ట్రెమండ‌స్ రెస్పాన్స్ రావ‌డంతో జెర్సీ పై మ‌రింత క్యూరియాసిటీ ఏర్ప‌డింది. అయితే.. జెర్సీ ట్రైల‌ర్ చూసిన త‌ర్వాత మ‌జిలీ సినిమాకి ద‌గ్గ‌ర‌గా ఉంటుందేమో అనిపించింది.  అంద‌రిలో ఆస‌క్తి క‌లిగించిన జెర్సీఈ నెల 19న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజైంది. మ‌రి…జెర్సీ అంచ‌నాల‌ను అందుకుందా..?  మ‌జిలీకి, జెర్సీకి పోలిక‌లు ఉన్నాయా..?  నానికి మ‌రో విజ‌యాన్ని అందించిందా..?  లేదా..? అనేవి చెప్పాలంటే ముందుగా క‌థ చెప్పాల్సిందే.

– అర్జున్ (నాని) కొడుకు న్యూయార్క్ లో ఉంటాడు. త‌న తండ్రి జీవితం పై జెర్సీ అనే పుస‌క్తం మార్కెట్ లోకి వ‌స్తుంది. ఆ పుస్త‌కానికి బాగా డిమాండ్ ఉంటుంది. ఆ పుస్తకాన్ని కొనుక్కోవాల‌ని ఇద్ద‌రు అమ్మాయిలు బుక్ షాపుకు వ‌స్తారు కానీ..పుస్త‌కం లేక‌పోవ‌డంతో వెళ్లిపోతారు. అయితే..అప్ప‌టికే జెర్సీ పుస్త‌కాన్ని కొనుక్కున్న నాని కొడుకు..బుక్ లేక‌పోవ‌డంతో వెళ్లిపోతున్న ఆ ఇద్ద‌రు అమ్మాయిలు ద‌గ్గ‌ర‌కి వెళ్లి జెర్సీ పుస్త‌కంలో ఉన్న క్రికెట‌ర్ అర్జున్ త‌న తండ్రి అని చెప్పి మా నాన్న గురించి త‌న క‌న్నా వేర వాళ్లు తెలుసుకుంటే హ్యాపీగా ఫీల‌వుతాను అని చెప్పి బుక్ వాళ్ల‌కి ఇచ్చేస్తాడు.

అక్క‌డ నుంచి 1986 ఫ్లాష్ బ్యాక్ లోకి క‌థ వెళుతుంది. మంచి క్రికెట‌ర్ అయిన అర్జున్,  సారా (శ్ర‌ద్ధా శ్రీనాధ్)ను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. అయితే..కొన్ని కార‌ణాల వ‌ల‌న క్రికెట్ ను వ‌దిలేస్తాడు. సారా జాబ్ చేస్తుంటే..ఖాళీగా ఇంట్లోనే ఉంటాడు. అర్జున్ కు కొడుకంటే ప్రాణం. 36 ఏళ్ల వ‌య‌సులో మ‌ళ్లీ క్రికెట్ ఆడాల‌నుకుంటాడు. ఎందుకు క్రికెట్ ను వ‌దిలేయాల్సి వ‌చ్చింది..? 36 ఏళ్ల వ‌య‌సులో ఎందుకు క్రికెట్ ఆడాల‌నుకున్నాడు..?  చివ‌రికి అర్జున్ అనుకున్న‌ది సాధించాడా..?   లేదా..? అనేది మిగిలిన క‌థ‌.

ప్లస్ పాయింట్స్

నాని, శ్ర‌ద్ధా శ్రీనాద్ న‌ట‌న‌

క‌థ‌, క‌థ‌నం,

గౌత‌మ్ ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ‌

అనిరుథ్ సంగీతం

మైనస్ పాయింట్స్

అక్క‌డ‌క్క‌డ స్లోగా అనిపించ‌డం

విశ్లేష‌ణ – అర్జున్ అంత‌ర్జాతీయ క్రికెటర్ అవ్వాల‌నుకుంటాడు కానీ..ప‌రిస్ధితుల ప్ర‌భావం వ‌ల‌న కాలేక‌పోతాడు. భార్య సారా జాబ్ చేస్తుంటే..అర్జున్ మాత్రం ఇంట్లోనే ఖాళీగా ఉంటాడు. జీవితంలో అనుకున్న ల‌క్ష్యాన్ని సాధించ‌లేక బాధ‌ప‌డే యువ‌కుడు పాత్ర‌లో నాని అద్భుతంగా న‌టించారు. అలాగే మిడిల్ క్లాస్ అమ్మాయిగా..ఎప్పుడూ భ‌ర్త‌తో న‌వ్వుతూ ఉండాల‌ని కోరుకునే గృహిణి పాత్ర‌లో శ్ర‌ద్ధా శ్రీనాద్ చాలా చ‌క్క‌గా న‌టించారు. అలాగే అర్జున్ కొడుకు పాత్ర‌లో న‌టించిన నాని కూడా బాగా న‌టించాడు. అర్జున్, త‌న కుమారుడు నాని వీరిద్ద‌రి మ‌ధ్య చిత్రీక‌రించిన స‌న్నివేశాలు ఓసారి న‌వ్విస్తాయి..ఓసారి ఏడిపిస్తాయి. ప్ర‌తి ఒక్క‌రిని క‌ద‌లిస్తాయి.

కొడుకు పుట్టిన‌రోజుకు గిఫ్ట్ ఇవ్వాల‌నుకుంటాడు అర్జున్. అయితే…గిఫ్ట్ ఇవ్వ‌డానికి 500 రూపాయ‌లు లేక‌పోవ‌డంతో ఆ తండ్రి ఏం చేసాడు.? ఎంత బాధ‌ప‌డ్డాడు..? ఆఖ‌రికి భార్య ప‌ర్స్ లో డ‌బ్బులును ఆమెకు చెప్ప‌కుండా తీయ‌డం..ఇది చూసి భార్య సారా అర్జున్ ని తిట్ట‌డం.. త‌దిత‌ర స‌న్నివేశాలు ప్రేక్ష‌కుడిని కంట‌త‌డి పెట్టిస్తాయి. ద‌ర్శ‌కుడు గౌత‌మ్ తిన్న‌నూరి..త‌ను చెప్పాల‌నుకున్న‌ది సిన్సియ‌ర్ గా చెప్పాడు ఎక్క‌డా..కావాల‌ని పెట్టిన‌ట్టుగా ఒక్క స‌న్నివేశం కూడా క‌నిపించ‌దు. కాక‌పోతే..అక్క‌డ‌క్క‌డ కాస్త స్లో అయిన‌ట్టు అనిపిస్తుంది. సెకండాఫ్ లో రంజీ మ్యాచ్ సీన్స్ చూస్తుంటే…నిజంగానే మ‌నం క్రికెట్ మ్యాచ్ చూస్తున్నాం అనే ఫీలింగ్ క‌లుగుతుంది.

అనిరుథ్ సంగీతం, సినిమాటోగ్రఫీ: సాను వర్గీస్‌, సితార ఎంట‌ర్ టైన్మెంట్స్ నిర్మాణం…ఇలా న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు అంద‌రూ అంత క‌ష్ట‌ప‌డి..కాదు ఇష్ట‌ప‌డి ఈ సినిమాకి వ‌ర్క్ చేసారు. అందుకే ఇంత మంచి సినిమా వ‌చ్చింది అని చెప్ప‌చ్చు. అర్జున్ కి కోచ్ పాత్ర‌లో స‌త్య‌రాజ్ పాత్ర‌కు త‌గ్గ‌ట్టుగా న‌టించారు. నాని, స‌త్య‌రాజ్ మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు ఆక‌ట్టుకుంటాయి.

మ‌జిలీ సినిమాతో జెర్సీ సినిమాకి  పోలిక ఉంటుంద‌ని ప్ర‌చారం జ‌రిగింది కానీ…ఇందులో ఒక స‌న్నివేశం త‌ప్పితే..మ‌జిలీ సినిమాకి జెర్సీకి అస‌లు పోలిక లేదు. డైరెక్ట‌ర్ గౌత‌మ్ ఫ‌స్ట్ మూవీ మ‌ళ్లీ రావాలో సంద‌ర్భానుసారంగా పాట‌లు పెట్టిన‌ట్టుగానే..ఇందులో కూడా డ్యూయ‌ట్స్, హీరో ఇంట్ర‌డ‌క్ష‌న్ సాంగ్స్ పెట్టాల‌నుకోకుండా సంద‌ర్భానుసారంగా వ‌చ్చే పాట‌ల‌ను పెట్టారు. క్లైమాక్స్ సీన్..కంట‌త‌డి పెట్టిస్తుంది. ఓ మంచి సినిమాని చూసామ‌నే ఫీలింగ్ క‌లుగుతుంది.

రేటింగ్ – 3.25/ 5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here