Home Actor జ‌గ్గుభాయ్ గురించి క్లారిటీ ఇచ్చిన అనిల్ రావిపూడి.

జ‌గ్గుభాయ్ గురించి క్లారిటీ ఇచ్చిన అనిల్ రావిపూడి.

36
0
జ‌గ్గుభాయ్ గురించి క్లారిటీ ఇచ్చిన అనిల్ రావిపూడి. spiceandhra

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు – స‌క్స‌స్ ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి కాంబినేష‌న్ లో రూపొందుతోన్న భారీ చిత్రం స‌రిలేరు నీకెవ్వ‌రు. ఇటీవ‌ల ప్రారంభ‌మైన ఈ సినిమాని మ‌హేష్ బాబు, దిల్ రాజు, అనిల్ సుంక‌ర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం కాశ్మీర్ లో షూటింగ్ జ‌రుపుకుంటోంది. మ‌హేష్ బాబు, రాజేంద్ర‌ప్ర‌సాద్ ల‌తో పాటు మ‌రి కొంత మంది ముఖ్య తారాగ‌ణం పై కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నారు.

ఇదిలా ఉంటే… ఈ చిత్రం నుంచి జ‌గ‌ప‌తి బాబు త‌ప్పుకున్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఆత‌ర్వాత దీనికి కార‌ణం… డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి జ‌గ‌ప‌తి బాబు క్యారెక్ట‌ర్ నిడివి త‌గ్గించార‌ని.. అది న‌చ్చ‌క‌పోవ‌డం వ‌ల‌నే జ‌గ్గుభాయ్ ఈ ప్రాజెక్ట్ నుంచి త‌ప్పుకున్నార‌ని జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. అయితే.. ప్ర‌చారంలో ఉన్న ఈ వార్త‌ల పై అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చారు.

ఇంత‌కీ ఏమ‌న్నారంటే… ఈ చిత్రంలోని జ‌గ‌ప‌తి బాబు గారి పాత్ర ఆయ‌న‌కు ఎంత‌గానో నచ్చింది. ఈ సినిమాలో న‌టించ‌డానికి ఆయ‌న ఎంత‌గానో ఇంట్ర‌స్ట్ చూపించారు. అయితే… కొన్ని అనివార్య కార‌ణాల వ‌ల‌న ఈ మూవీలో న‌టించ‌డం కుద‌ర‌లేదు. భ‌విష్య‌త్ లో ఆయ‌న‌తో క‌లిసి వ‌ర్క్ చేయాల‌నుకుంటున్నాను. మమ్మ‌ల్ని అర్ధం చేసుకున్నంద‌కు థ్యాంక్స్ అని తెలియ‌చేసాడు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here