Home News బి.సిల‌కు జ‌నాభా ప్రాతిప‌దిక‌న రిజ‌ర్వేష‌న్లు కేటాయించాలి – టీపీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి.

బి.సిల‌కు జ‌నాభా ప్రాతిప‌దిక‌న రిజ‌ర్వేష‌న్లు కేటాయించాలి – టీపీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి.

90
0

బి.సిల‌కు జ‌నాభా ప్రాతిప‌దిక‌న రిజ‌ర్వేష‌న్ల కేటాయింపు విష‌యంలో బి.సి సంఘాలు చేస్తున్న పోరాటాల‌కు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తుంద‌ని, బి.సిల‌కు జ‌నాభా ప్రాతిప‌దిక‌న రిజ‌ర్వేష‌న్లు చేయాల‌ని కాంగ్రెస్‌పార్టీ డిమాండ్ చేస్తుంద‌ని తెలంగాణ‌ప్ర దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షులు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి అన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం సుప్రీంకోర్టు ఆదేశాల పేరుతో 50 శాతం రిజ‌ర్వేష‌న్లు మించ‌కూడ‌ద‌నే నిబంధ‌న‌ల‌తో బి.సిల‌కు పంచాయ‌తీ ఎన్నిక‌ల‌లో కేవ‌లం 22 శాతం రిజ‌ర్వేషన్లు కేటాయించార‌ని దీని వ‌ల్ల రాష్ట్రంలో వేలాది గ్రామాల‌లో బి.సిల‌కు పంచాయ‌తీల‌లో రిజ‌ర్వేషన్లు దక్క‌కుండా పోతున్నాయ‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేసారు. ఈ విష‌య‌మై తాను ఇప్ప‌టికే ముఖ్య‌మంత్రికి లేఖ రాశాన‌ని బి.సిల‌కు జ‌నాభా ప్రాతిప‌దిక‌న రిజ‌ర్వేషన్ల‌ను కేటాయించే విష‌యంలో కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తుంద‌ని జ‌నాభా లెక్క‌లు నిర్వ‌హించి బి.సిల గ‌ణ‌న చేశాక పంచాయ‌తీ ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని తాము ఇప్ప‌టికే కోరామ‌ని ఆయ‌న చెప్పారు.

హైకోర్టు ఉత్త‌ర్వుల ప్ర‌కారం బి.సిల‌లో కూడా ఎబిసిడిఇ విభ‌జ‌న ప్ర‌కారం కులాల గ‌ణ‌న చేయాల్సి ఉంద‌ని అయితే ప్ర‌భుత్వం ఇవేమి ప‌ట్టించుకోకుండా గ‌త ఎన్నిక‌ల‌లో 34 శాత బి.సిల‌కు రిజ‌ర్వేష‌న్లు ఉంటే ఈ సారి కేవలం 22కు ప‌రిమితం చేసి ఎన్నిక‌ల‌కు సిద్దం అయింద‌ని దీని వ‌ల్ల గ్రామాల‌లో బి.సిల‌కు చాల అన్యాయం జ‌రుగుతుంద‌ని అన్నారు. ఇది అంబేద్క‌ర్ ఆలోచ‌న చేసిన రిజ‌ర్వేష‌న్ల స్పూర్తికే విరుద్ద‌మ‌ని రాజ్యంగ విరుద్ద‌మ‌ని అన్నారు. ఇప్ప‌టికైనా ప్ర‌భుత్వం పున‌రాలోచించి బి.సిల‌కు త‌గిన న్యాయం చేయాల‌ని డిమాండ్ చేశారు. 

ఈ విష‌యాల‌పై బి.సి సంఘాలు త‌న‌కు విన‌తి ప‌త్రం స‌మ‌ర్పించాయ‌ని బి.సి విన‌తుల‌ను తాము సంపూర్ణంగా అంగీక‌రించి వారి పోరాటాల‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తున్నామ‌ని అన్నారు. బి.సి సంఘాలు, రాజ‌కీయ పార్టీలు, ప్ర‌జా సంఘాలు చేప‌ట్టే ఉద్య‌మాల‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. నేటి నుంచి బిసి సంఘాలు చేయ‌నున్న నిర‌వ‌ధిక పోరాటాల‌లో కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు పాలు పంచుకోవాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here