Home News Political News జ‌న‌సేనలో చేరిన నాదెండ్ల మ‌నోహర్. అస‌లు.. ప‌వ‌న్ పార్టీలో చేర‌డానికి కార‌ణం ఏమిటి..?

జ‌న‌సేనలో చేరిన నాదెండ్ల మ‌నోహర్. అస‌లు.. ప‌వ‌న్ పార్టీలో చేర‌డానికి కార‌ణం ఏమిటి..?

30
0

ఆంధ్రప్రదేశ్  మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చి జ‌నసేన పార్టీలో చేరారు. ఎన్నికలు రానున్న సమయంలో ఆయన పార్టీకి రాజీనామా చేసి జ‌న‌సేన పార్టీలో చేర‌డం రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశం అయ్యింది. ఆయ‌న‌ తిరుపతి విమానాశ్రయంలో జనసేన పార్టీ అధినేత‌ పవన్ కళ్యాణ్‌ను కలిశారు. ఈ రోజు జ‌న‌సేన పార్టీలో చేరారు. అస‌లు..నాదెండ్ల మ‌నోహ‌ర్ జ‌న‌సేన పార్టీలో చేర‌డానికి కార‌ణం ఏమిటి అనేది ఆస‌క్తిగా మారింది.

ఈ సంద‌ర్భంగా నాదెండ్ల మ‌నోహ‌ర్ గురించి క్లుప్తంగా చెప్పాలంటే..నాదెండ్ల మనోహర్ గుంటూరు జిల్లా తెనాలి అసెంబ్లీ నియోజక వర్గం నుంచి శాసనసభకు ప్రాతినిథ్యం వహించారు. ఇతను ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన నాదెండ్ల భాస్కరరావు కొడుకు. మనోహర్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీయే పట్టా పొందారు.

2011 జూన్ నెలలో స్పీకర్ అయ్యారు. 2004, 2009 సార్వత్రిక ఎన్నికల్లో గుంటూరు జిల్లా తెనాలి నుంచి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచారు. స్పీకర్‌గా ఎన్నిక కాక ముందు ఆయన డిప్యూటీ స్పీకర్‌గా పని చేశారు. కాంగ్రెస్ పార్టీలో పలు హోదాల్లో పని చేశారు. ఏపీ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీగా చేశారు. ఆ సమయంలో ఎన్ఎస్‌యూఐ, యూత్ కాంగ్రెస్‌ల పై ప్రత్యేక దృష్టి సారించారు. ఇత‌ర విష‌యాల‌కు వ‌స్తే..ఇతను టెన్నిస్ బాగా ఆడతారు. పలు పోటీల్లో పాల్గొన్నారు. 1986లో నేషనల్ గేమ్స్‌లో కాంస్య పతకం కూడా సాధించారు.

జ‌న‌సేన అధినేత‌ పవన్, నాదెండ్ల మనోహర్ తిరుమల శ్రీవారి దర్శనం
చేసుకున్నారు. ఆ తర్వాత  నాదెండ్ల జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. విభజన నేపథ్యంలో 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణంగా దెబ్బతిన్నది. ఒక్క అసెంబ్లీ, లోకసభ స్థానంలో కూడా గెలవలేదు. పైగా డిపాజిట్లు కోల్పోయింది. దీంతో కాంగ్రెస్ నేత‌లు వేరే పార్టీలో చేరేందుకు ఆస‌క్తి చూపుతున్నారు. అయితే…నాదెండ్ల జ‌గ‌న్ పార్టీలో చేర‌తార‌ని ప్ర‌చారం జ‌రిగింది. కానీ..జ‌న‌సేనలో చేరి అంద‌రికీ షాక్ ఇచ్చారు.

ప‌వ‌న్ పార్టీలో చేర‌డానికి కార‌ణం ఏంటంటే…నాదెండ్లకు క్లీన్ ఇమేజ్ ఉంది. అందుకే ఆయ‌నే చేరే పార్టీకి కూడా అదే ఇమేజ్ ఉండాల‌నుకున్నారు. అందుకే ఆయ‌న జ‌న‌సేన పార్టీలో చేరారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో ఆయ‌న‌కు మంచి స్నేహం ఉంది. జ‌న‌సేన పార్టీ ఆవిర్భావం నుంచి జ‌న‌సేన సైద్ధాంతిక విధానాల పై మ‌నోహ‌ర్..ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో మాట్లాడుతూనే ఉన్నారు. నాలుగేళ్లుగా జ‌న‌సేన పార్టీ స‌భ‌లు, ప‌వ‌న్ ప్ర‌సంగాల‌ను ప‌రిశీలిస్తూ త‌న అభిప్రాయాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు చెప్పేవారు. మ‌నోహ‌ర్ చేరిక‌తో జ‌న‌సేన‌కు మ‌రింత బ‌లం పెరిగింద‌ని చెప్ప‌చ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here