Home Actor జ‌న‌సేన‌ పార్టీ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ గారి ఆశ‌యాల‌కు సంబంధించిన‌దైతే.. మా `జై సేన` చిత్రం ఆయ‌న...

జ‌న‌సేన‌ పార్టీ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ గారి ఆశ‌యాల‌కు సంబంధించిన‌దైతే.. మా `జై సేన` చిత్రం ఆయ‌న భావాల‌కు సంబంధించింది – ద‌ర్శ‌కుడు వి.స‌ముద్ర‌

128
0

సింహ‌రాశి, శివ‌రామ‌రాజు, టైగ‌ర్ హ‌రిశ్చంద్ర ప్ర‌సాద్, మ‌హానంది, మ‌ల్లెపువ్వు..త‌దిత‌ర విభిన్న క‌థా చిత్రాల‌ను తెర‌కెక్కించిన వి. స‌ముద్ర తెర‌కెక్కిస్తోన్న తాజా చిత్రం జై సేన‌. వి.విజయలక్ష్మి సమర్పణలో శివ మహాతేజ ఫిలిమ్స్‌ పతాకం పై వి.సాయి అరుణ్‌ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకాంత్‌, సునీల్‌, శ్రీ, పృథ్వీ, ప్రవీణ్‌, కార్తికేయ ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను, మోషన్‌ పోస్టర్‌ను సునీల్ హైదరాబాద్‌లో విడుదల చేశారు.

ఈ సంద‌ర్భంగా దర్శకుడు వి.సముద్ర మాట్లాడుతూ – ఈ చిత్రంలో శ్రీకాంత్‌, సునీల్‌తో పాటు నలుగురు కొత్త హీరోలను పరిచయం చేస్తున్నాను. షూటింగ్‌ పూర్తయ్యింది. ప్యాచ్‌ వర్క్‌ మిగిలి ఉంది. పది కాలాల పాటు నిలిచిపోయేలా మంచి సినిమాలు తీయాలనే శివ మహాతేజ ఫిలింస్‌ బ్యానర్‌ను స్థాపించాం. ఇందులో తొలి ప్రయత్నంగా చేస్తున్న సినిమా ఇది.

పవన్ కళ్యాణ్ గారు స్థాపించిన పార్టీ జనసేన.  ఆయన రాజకీయ ఆశయాలకు సంబంధించినది అయితే మా సినిమా ‘జై సేన’ ఆయన భావాలకు సంబంధించిన చిత్రం. అయితే… ఆయన అభిమానంతో చేసే కొన్ని మంచి పనులను ఇందులో చూపిస్తున్నాం. నా ప్రతి సినిమాలో సామాజిక అంశాలున్నట్లే ఇందులో కూడా సోషల్‌ కాజ్‌ ఉంటుంది. మాకు మా యూనిట్‌కు చాలా మంచి పేరు తెచ్చే సినిమా అవుతుంది.

 రవిశంకర్‌ బ్రహ్మాండమైన పాటలను అందించారు. కో ప్రొడ్యూసర్‌ శిరీష్‌ రెడ్డి గారు అన్ని విషయాల్లో నాకు బ్యాక్‌బోన్‌లా నిలిచారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను వచ్చే నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. అందరూ మా బ్యానర్‌ను.. ఇందులో పరిచయం అవుతున్న హీరోలను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here