Home News జ‌న‌సేన‌…సామాన్యుల జీవితాల్లో వెలుగు నింపేందుకే..! – రాజ‌మండ్రి అర్బ‌న్ జ‌న‌సేన అభ్య‌ర్ధి అత్తి స‌త్య‌నారాయ‌ణ‌

జ‌న‌సేన‌…సామాన్యుల జీవితాల్లో వెలుగు నింపేందుకే..! – రాజ‌మండ్రి అర్బ‌న్ జ‌న‌సేన అభ్య‌ర్ధి అత్తి స‌త్య‌నారాయ‌ణ‌

55
0


జ‌న‌సేన మ్యానిఫెస్టో సామాన్యుల‌కు అతి ద‌గ్గ‌ర‌గా ఉండే మ్యానిఫెస్టో. ఉచిత గ్యాస్ ప‌థ‌కం.. రేష‌న్ బ‌దులు క్యాష్ అనే ప‌థ‌కం పేద‌ల‌ను దృష్టిలో పెట్టుకుని రూపొందించామ‌ని రాజ‌మండ్రి అర్బన్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి జ‌న‌సేన పార్టీ త‌రుపున పోటీ చేస్తున్న అత్తి స‌త్య‌నారాయ‌ణ తెలియ‌చేసారు.  చిన్న కుటుంబానికి 2,500, పెద్ద కుటుంబానికి 3,500 ఇవ్వాల‌నుకుంటున్నాం. ఈ అమౌంట్ ని నేరుగా వాళ్ల అకౌంట్ లోనే వేస్తే..వాళ్ల‌కు న‌చ్చిన సరుకులు కొనుక్కునే అవ‌కాశం ఉంటుంది అన్నారు.

అలాగే ఒక‌ట‌వ త‌రగ‌తి నుంచి పోస్ట్ గ్రాడ్యూష‌న్ వ‌ర‌కు ఉచిత విద్య. విద్యార్ధుల‌కు ఉచిత బ‌స్ సౌక‌ర్యం, డొక్కా సీత‌మ్మ అనే క్యాంటీన్ లు పెట్టి ఉచిత భోజ‌న స‌దుపాయం కూడా ఏర్పాటు చేయాల‌నుకుంటున్నాం. అయితే.. ఎన్ని స‌దుపాయాలు ఉన్నాఆరోగ్యం అనేది ముఖ్యం. అందుచేత ప్ర‌తి కుటుంబానికి 10 ల‌క్ష‌ల ఆరోగ్య భీమా ప‌థ‌కం కూడా ఏర్పాటు చేయ‌డం జ‌రిగింది. అలాగే రైతుల‌కు 5 వేలు ఫెన్ష‌న్ లా ఇవ్వ‌డం..ఇలా ఎన్నో సంక్షేమ ప‌థ‌కాలు రూపొందించాం.

 మా మ్యానిఫెస్టో సామాన్యుల‌కు అండ‌గా ఉంటూ వారి జీవితాల్లో వెలుగు నింపాల‌నుకుంటుంది. అందుచేత ప్ర‌జ‌లంద‌రూ గ‌మ‌నించి ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారి నాయ‌క‌త్వాన్ని బ‌ల‌పరిచి ఆయ‌న్ని సీఎంని చేస్తార‌ని ఆశిస్తున్నాను అన్నారు.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here