Home Political News జ‌న‌సేన క‌వాతు ల‌క్ష్యం ఇదే..!

జ‌న‌సేన క‌వాతు ల‌క్ష్యం ఇదే..!

118
0

ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజ్‌పై జనసేన కవాతుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పిచ్చుకలంక నుంచి కాటన్‌ విగ్రహం వరకు సుమారు రెండున్నర కిలోమీటర్ల గంటన్నర సేపు కవాతు నిర్వహిస్తారు. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి విజ్జేశ్వరం మీదుగా పవన్‌ కల్యాణ్‌ పిచ్చుకలంక చేరుకుంటారు. సరిగ్గా మధ్యాహ్నం మూడు గంటలకు కవాతు ప్రారంభమవుతుంది.

ఈ నేపథ్యంలో ప్రజా పోరాట యాత్ర పేరుతో తన ఆలోచనలను, పార్టీ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకువెళ్లడం కోసం జిల్లాల వారీగా పర్యటిస్తున్నారు. కవాతుతో ఆయన పశ్చిమగోదావరి జిల్లాలో ప్రవేశించనున్నారు. మధ్యాహ్నం 3-4.30 గంటల మధ్య కవాతు జరుగుతుంది. అనంతరం కాటన్‌ సెంటర్లో జరిగే బహిరంగ సభలో పవన్‌ మాట్లాడతారు.

అయితే..జ‌న‌సేన క‌వాతు ల‌క్ష్యం ఏంటి అనేది జ‌న‌సేన అధ్య‌క్షుడు ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌చేసారు. ఇంత‌కీ క‌వాతు ల‌క్ష్యం ఏంటంటే…క‌వాతు మ‌న ల‌క్ష్యం కోసం..క‌వాతు మ‌న థ్యేయం కోసం..క‌వాతు మ‌న రేప‌టి కోసం..క‌వాతు మ‌న బిడ్డ‌ల కోసం..క‌వాతు జ‌న‌సైనికుడై ప‌ద అని తెలియ‌చేసారు. జ‌న సైనికులు మ‌న క‌వాతుకు అండ‌గా ఉన్న ఆడ‌ప‌డుచుల‌కు మ‌హిళా శ‌క్తికి మీరు ర‌క్ష‌ణ క‌వ‌చంలా నిల‌బ‌డండి. త‌ల్లి భ‌వాని దేవి అనుగ్ర‌హం పొందండి అని చెప్పారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here