Home News జ‌న‌సేన పార్టీకి ప్ర‌జ‌ల ఆశీర్వాదం ఉంది. ఖ‌చ్చితంగా విజ‌యం మాదే – తెనాలి జ‌న‌సేన అభ్య‌ర్ధి...

జ‌న‌సేన పార్టీకి ప్ర‌జ‌ల ఆశీర్వాదం ఉంది. ఖ‌చ్చితంగా విజ‌యం మాదే – తెనాలి జ‌న‌సేన అభ్య‌ర్ధి నాదెండ్ల మ‌నోహ‌ర్

112
0


గుంటూరు జిల్లా తెనాలి నియోజ‌క‌వ‌ర్గంలో జ‌న‌సేన నేత నాదెండ్ల మ‌నోహ‌ర్ ఇంటింటికి వెళ్లి ప్ర‌చారం చేస్తున్నారు. ఎన్నిక‌ల తేదీ ద‌గ్గ‌ర ప‌డ‌డంతో ప్ర‌చారంలో స్పీడు పెంచి ప్ర‌త్య‌ర్ధుల కంటే ముందుగా దూసుకెళుతున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టిస్తూ..జ‌న‌సేన పార్టీ సిద్ధాంతాల‌ను, ఆశ‌యాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తున్నారు. అలాగే ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకుంటున్నారు. తెనాలి నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న స‌మ‌స్య‌ల‌ను ప‌వ‌న్ దృష్టికి తీసుకెళ్లి ప‌రిష్కారం అయ్యేలా చూస్తాన‌ని హామీ ఇచ్చారు.

ఈ సంద‌ర్భంగా నాదెండ్ల మ‌నోహ‌ర్ మాట్లాడుతూ...ప్ర‌జ‌లంద‌రూ గ‌తంలో చేసిన అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను గుర్తు పెట్టుకుని చెబుతుంటే చాలా సంతోషంగా అనిపించింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారు ఏదైతే కోరుకుంటున్నారో…అలాగే ప్ర‌జ‌లు కూడా మార్పు రావాలి అని బ‌లంగా కోరుకుంటున్నారు.  పార్టీల‌కు అతీతంగా ప‌ని చేసే పార్టీ జ‌న‌సేన పార్టీ. ప్ర‌జ‌లు మాపై చూపిస్తున్న ఆద‌ర‌ణ నిలుపుకోవ‌డానికి అనేక ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకున్నాం. రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా మ‌హిళ‌ల కోసం..ముఖ్యంగా యువ‌త కోసం కొత్త కార్య‌క్ర‌మాలు తీసుకురాబోతున్నాం. ఈ ప్రాంత అభివృద్ధి కోసం అంద‌రం క‌లిసి ప‌ని చేస్తాం. ప్ర‌జ‌లు జ‌న‌సేన పార్టీని ఆశీర్వ‌దిస్తార‌ని న‌మ్ముతున్నాం. ఖచ్చితంగా విజ‌యం మాదే అని ధీమా వ్య‌క్తం చేసారు.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here