Home News జ‌న‌సేన పార్టీలో నాగ‌బాబు – న‌ర‌సాపురం నుంచి పోటీ..!

జ‌న‌సేన పార్టీలో నాగ‌బాబు – న‌ర‌సాపురం నుంచి పోటీ..!

84
0


ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతుండ‌డంతో రాజ‌కీయ పార్టీలో చేరిక‌లు ఊపందుకున్నాయి. జ‌న‌సేన పార్టీలో మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు చేరుతున్న‌ట్టు జ‌న‌సేన పార్టీ ట్విట్ట‌ర్ ద్వారా అఫిషియ‌ల్ గా ఎనౌన్స్ చేసింది. ప‌శ్చిమగోదావరి జిల్లాలోని నరసాపురం లోక్ సభ స్థానం నుంచి నాగబాబు పోటీ చేస్తారని వెల్లడించింది.

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ఇప్పటికే జనసేన విశాఖ లోక్ సభ స్థానాన్ని కేటాయించింది. అలాగే భీమిలీ నుంచి పంచకర్ల సందీప్, విజయనగరం లోక్ సభ స్థానం అభ్యర్థిగా శ్రీ ముక్కా శ్రీనివాసరావు, కాకినాడ లోక్ సభ జనసేన అభ్యర్థిగా శ్రీ జ్యోతుల వెంకటేశ్వరరావు, అమలాపురం నుంచి శెట్టిబత్తుల రాజబాబు, పెద్దాపురం నుంచి తుమ్మల రామస్వామి (బాబు), పోలవరం నుంచి చిర్రి బాలరాజు, అనంతపురం నుంచి టి.సి. వరుణ్  పోటీలో ఉంటారని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here