Home Actor జ‌న‌సేన పార్టీ ఓట‌మి నుంచి కోలుకోవ‌డానికి కేవ‌లం 15 నిమిషాలు మాత్ర‌మే ప‌ట్టింది – తానా...

జ‌న‌సేన పార్టీ ఓట‌మి నుంచి కోలుకోవ‌డానికి కేవ‌లం 15 నిమిషాలు మాత్ర‌మే ప‌ట్టింది – తానా మహా సభల్లో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

69
0
జ‌న‌సేన పార్టీ ఓట‌మి నుంచి కోలుకోవ‌డానికి కేవ‌లం 15 నిమిషాలు మాత్ర‌మే ప‌ట్టింది - తానా మహా సభల్లో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ spiceandhra

అమెరికాలో ఎన్ని ఆర్గ‌నైజేష‌న్లు ఉన్నా మ‌నంద‌రం క‌లసిక‌ట్టుగా ఉండాలి. అవ‌స‌రం వ‌చ్చిన‌ప్పుడు మ‌న‌కు మ‌న‌మే స‌హాయం చేసుకోవాలి త‌ప్ప బ‌య‌ట‌వాడు చేయ‌డు’ అని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. శనివారం ఉదయం 6గం.(భారత కాలమాన ప్రకారం)కు అమెరికాలోని వాషింగ్టన్‌ డీసీలో తానా మహాసభల వేదిక నుంచి శ్రీ పవన్ కళ్యాణ్ ప్రసంగించారు.

తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా(తానా) 22వ మహాసభలు అట్టహాసంగా జ‌రుగుతున్నాయి.  అమెరికా నలుమూలల నుంచే కాకుండా తెలుగు రాష్ట్రాలు, వివిధ దేశాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిధిగా జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షులు శ్రీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారు హాజ‌ర‌య్యారు.

సందర్భంగా న్ ళ్యాణ్ మాట్లాడుతూ.. “కొంత‌మంది రాజ‌కీయ‌నాయ‌కులు కులాల‌ను, మ‌నుషుల‌ను విడ‌దీయాల‌ని చూస్తారు. నేను మాత్రం రాజ‌కీయాల్లోకి వ‌చ్చింది మ‌నుషుల‌ను క‌ల‌ప‌డానికే. ఈ విధానం అప‌జ‌యం ఇస్తే గ‌ర్వంగా తీసుకుంటాను త‌ప్ప మ‌నుషుల‌ను విడ‌గొట్టే రాజ‌కీయం చేయ‌ను. రాజ‌కీయాల్లోకి వ‌చ్చింది ప‌త‌న‌మ‌వుతున్న‌విలువ‌లు కాపాడటం కోసం, ధైర్యంగా స‌మ‌స్య‌ల‌ను ఎలుగెత్తి చెప్ప‌డానికే. అంతే గానీ స్కాములు, ద్రోహాలు చేయ‌డానికి కాదు. జైళ్ల‌లో కూర్చున్న వ్య‌క్తులు ఏ ఇబ్బంది లేకుండా స‌మాజంలో ద‌ర్జాగా తిరుగుతున్న‌ప్పుడు… స‌త్యాన్ని మాట్లాడే వ్య‌క్తినైన నేనెందుకు ఓట‌మిని చూసి భ‌య‌ప‌డ‌తాను.

డ‌బ్బుతో ముడిప‌డిన రాజ‌కీయాల్లో మార్పు తీసుకురావ‌డం చాలా క‌ష్ట‌మ‌ని తెలియదా..? డ‌బ్బు ఖ‌ర్చు చేయ‌క‌పోతే నేను కూడా ఓడిపోతాన‌ని తెలుసు, కానీ న‌మ్మిన సిద్ధాంతాల కోసం ఎన్ని బాధ‌లైనాప‌డాల‌ని నిర్ణ‌యించుకున్నాను. చిన్న‌ప్ప‌టి నుంచి ఓట‌మి నాకు గొప్ప పాఠాలే నేర్పింది. ఓడిన ప్ర‌తిసారి విజ‌యం  ద‌గ్గ‌రయింది. అందుకే ఓట‌మి అంటే భ‌యం లేదు. జ‌న‌సేన పార్టీ ఓట‌మి నుంచి కోలుకోవ‌డానికి కేవ‌లం 15 నిమిషాలు మాత్ర‌మే ప‌ట్టింది.

విలువ‌ల‌తో కూడిన పోరాటం చేశాం కాబట్టే ధైర్యంగా ఉన్నాం. ఎన్ని క‌ష్టాలు వచ్చినా  తెలుగురాష్ట్రాల‌కు, భార‌త‌దేశానికి అండ‌గా నిల‌బ‌డ‌తాం. స్వామి వివేకానందుడి ప్ర‌సంగాలు విని, పుస్త‌కాలు చ‌దివి దేశ సంస్కృతి, సంప్ర‌దాయాలు చాలా గొప్ప‌వ‌ని అనుకునేవాడిని. అయితే  స‌మాజంలో కులాలు, మ‌తాల మ‌ధ్య ఐక‌త్య లేక‌పోవ‌డం చూసి ఆవేద‌న క‌లిగిచింది. దేశ స‌మ‌గ్ర‌త‌కే భంగం వాటిల్లుతుంద‌ని భ‌య‌ప‌డేవాడిని.

  ఈ గుండె ధైర్యం ప్రజలిచ్చిందే..

విభజనకు ముందు – సొంత రాష్ట్రంలోనే ద్వితీయ‌శ్రేణి పౌరులుగా బ‌త‌కాల్సిన ప‌రిస్థితులు చూసి బాధ క‌లిగి దేశాన్ని ప్రేమించేవాడిగా- ప‌ద‌వులు వ‌స్తాయే లేదో తెలియదు, ఎన్నిక‌ల్లో పోటీ చేస్తానో లేదో తెలియ‌దు, కానీ స‌రికొత్త త‌రానికి బ‌ల‌మైన గొంతు కావాల‌ని చెప్పి జ‌న‌సేన పార్టీ పెట్టాను. దాని కోసం ఎన్ని ఎదురుదెబ్బ‌లైనా తిన‌డానికి సిద్ధ‌మ‌య్యాను. సినిమాల్లో డైలాగులు చెప్ప‌డం వేరు, నిజ‌ జీవితంలో మాట్లాడ‌టం వేరు.  నిజ‌ జీవితంలో మాట్లాడాలంటే చాలా గుండె ధైర్యం కావాలి. ఆ గుండె ధైర్యం ప్ర‌జ‌లు ఇచ్చిందే.  ప్ర‌జ‌ల అండే లేక‌పోతే నేను ఇంత‌ ధైర్యంగా మాట్లాడ‌గ‌లిగేవాడిని కాదు.

ఖుషి సినిమా వంద రోజుల ఫంక్ష‌న్ లో యువతను ఉద్దేశించి మాట్లాడుతూ ఈవ్ టీజింగ్ చేయ‌కుండా ఉందాం, ఎంత‌మంది చేయ‌కుండా ఉంటారో చేతులెత్తండి అంటే ఒక్క‌రు కూడా చేతులెత్త‌లేదు.  చేతులెత్తితే ఈవ్ టీజింగ్ చేయ‌కుండా ఉండాల‌ని భ‌య‌ప‌డ్డారు. అప్పుడ‌ర్థమైంది సినిమాలు మ‌నుషుల‌ను మార్చ‌లేవ‌ని, రాజ‌కీయాల‌ను ప్ర‌భావితం చేయ‌లేవ‌ని. స‌మాజం ప‌ట్ల ప్రేమ ఉంటే బయ‌ట‌కొచ్చి ఏదో ఒక‌టి చేయాల‌ని ఆ రోజే నిర్ణ‌యించుకున్నాను.

అప్ప‌టి నుంచి సినిమాల మీద ఆస‌క్తి త‌గ్గి స‌మాజాన్ని చ‌ద‌వడం మొద‌లుపెట్టాను. స‌క్సెస్ కోసం ఎంత స‌హ‌నంతో వెయిట్ చేస్తానంటే.. ఖుషి త‌ర్వాత నాకు దొరికిన స‌క్సెస్ గ‌బ్బ‌ర్ సింగే. దాదాపు 10 ఏళ్లు స‌క్సెస్ కోసం స‌హ‌నంతో నిరీక్షించాను. ఓట‌మిని త‌ట్టుకుని ఎలా నిల‌బ‌డాలి అని నెల్సన్ మండేలా  రాసిన లాంగ్ వాక్ టూ ఫ్రీడ‌మ్ పుస్త‌కం చ‌దివి నేర్చుకున్నాను. సక్సెస్ కోసం సహనంతో వేచి చూస్తాను. కష్టపడతాను. విజయం పొందే అవకాశం వస్తుంది అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here