Home Political News జ‌న‌సేన ప్రవాస గ‌ర్జన‌తో ద‌ద్దరిల్లిన డ‌ల్లాస్‌

జ‌న‌సేన ప్రవాస గ‌ర్జన‌తో ద‌ద్దరిల్లిన డ‌ల్లాస్‌

106
0

* క‌వాతు, కార్ ర్యాలీల‌తో జ‌న‌సేనానికి ఘ‌న స్వాగ‌తం

* ప్రవాసుల‌తో కిక్కిరిసిన ట‌యోటా మ్యూజిక్ ఫ్యాక్టరీ

* పూర్ణకుంభ స్వాగ‌తం ప‌లికిన మ‌హిళ‌లు

జ‌న‌సేన ప్ర‌వాసగ‌ర్జ‌న స‌భతో  డ‌ల్లాస్ న‌గ‌రం ద‌ద్ద‌రిల్లింది. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని అన్ని దారులు ఒక రోజు ముందు నుంచే డ‌ల్లాస్ బాట ప‌ట్టాయి. జ‌న‌సేన అధ్య‌క్షులు శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ పాల్గొనే స‌భ‌ని విజ‌య‌వంతం చేసేందుకు ఎన్‌.ఆర్‌.ఐ జ‌న‌ సైనికులు పెద్ద ఎత్తున త‌ర‌లి వ‌చ్చారు. సుదూర ప్రాంతాల్లో ఉన్న జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు విమానాల‌ను ఆశ్ర‌యించ‌గా, డ‌ల్లాస్ స‌మీప న‌గ‌రాల్లో ఉన్న ప్ర‌వాసులు రోడ్డు ప్ర‌యాణం ద్వారా ఒక రోజు ముందు నుంచే టెక్సాస్‌కి చేరుకున్నారు.  శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఉద‌యం డ‌ల్లాస్ న‌గ‌రానికి చేరుకోగా, అప్ప‌టికే క‌వాతు, కార్ ర్యాలీల కోసం ఎన్‌.ఆర్‌.ఐ జ‌న‌సైనికులు గాంధీ పార్క్ వ‌ద్ద‌కి పెద్ద సంఖ్య‌లో చేరుకున్నారు. అంచ‌నాల‌కి మించి కార్ ర్యాలీలో వంద‌లాది వాహ‌నాలు కదంతొక్క‌గా, క‌వాతులో కూడా జ‌న‌సైనికులు పెద్ద ఎత్తున శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ నిఅనుస‌రించారు. ర్యాలీలో జ‌న‌సేన జెండాల‌తో పాటు జాతీయ జెండాలు రెప‌రెప‌లాడాయి. వేలాదిగా త‌ర‌లివ‌చ్చిన ప్ర‌వాసులు దిక్కులు పిక్క‌టిల్లే స్థాయిలో నినాదాల‌తో మారుమోగించారు.

ఓ వైపు క‌వాతు, కార్ ర్యాలీ సాగుతుండ‌గానే, ప్ర‌వాస‌గ‌ర్జ‌న ప్ర‌ధాన వేదిక ట‌యోటామ్యూజిక్ ఫ్యాక్ట‌రీ ద్వారాలు తెరుచుకున్నాయి. జ‌న‌సేన అధ్య‌క్షులు శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్కి ఘ‌న‌స్వాగ‌తం ప‌లికేందుకు గేటు వ‌ద్దే జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు పెద్ద సంఖ్య‌లోనిలిచిపోయి, సిఎం..సిఎం.. అంటూ నినాదాల‌తోమారుమోగించారు. శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ స‌భా ప్రాంగ‌ణానికి చేరుకోగానే ఈ నినాదాలు మ‌రింతహోరెత్తాయి. ట‌యోటా మ్యూజిక్ ఫ్యాక్టరీ వ‌ద్ద అచ్చ తెలుగు సంప్ర‌దాయ వ‌స్త్ర‌ధార‌ణ‌లోఎన్‌.ఆర్‌.ఐ జ‌న‌సేన వీర మ‌హిళా కార్య‌క‌ర్త‌లు పూర్ణ కుంభంతో వేద‌పండితులమంత్రోచ్చ‌ర‌ణ‌ల మ‌ధ్య ఆయ‌న‌కి స్వాగ‌తం ప‌లికారు. జ‌న‌సేన ప్ర‌వాస గ‌ర్జ‌నఆద్యంతం భార‌త జాతీయ‌త ఉట్టిప‌డింది.ప్ర‌వాస గ‌ర్జ‌న స‌భ ప్రారంభానికి ముందుఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు ఆహుతుల‌ని అల‌రించాయి. గ‌ణ‌ప‌తిస్తోత్రంతో స‌భ ప్రారంభం అయ్యింది.

 అనంత‌రం ప్ర‌వాస‌గ‌ర్జ‌న స‌భ‌కి ఆహ్వానిస్తూ ఎన్‌.ఆర్‌.ఐల‌ని ఉత్తేజ‌ప‌రిచేందుకు ప్ర‌త్యేకంగా రూపొందించిన ‘రా..సైనికా’ పాట‌ని ప్రద‌ర్శించారు. ఎన్‌.ఆర్‌.ఐ చిన్నారులు, మ్యూజిక్ డైరెక్ట‌ర్ ర‌ఘు కుంచె సాంస్కృతిక కార్య‌క్ర‌మాల‌కి ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు. ఓ వైపు సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తూ, మ‌ధ్య మ‌ధ్య‌న జ‌న‌సేన అధినేత శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ పోరాట యాత్ర‌, రాజ‌మండ్రి క‌వాతు, తిత్లీ తుపాను ప్ర‌భావిత ప్రాంతాల్లో ప‌ర్య‌ట‌న‌కి సంబంధించిన వివ‌రాల‌తో కూడిన ఏవీలు ప్ర‌ద‌ర్శించారు. తూర్పు గోదావ‌రి జిల్లా పోరాట యాత్ర‌లో వంతాడ మైనింగ్ మాఫియా అక్ర‌మాల‌ని వెలుగులోకి తీసుకు వ‌చ్చిన డాక్యుమెంట‌రీ టీమ్ కృషి, కాకినాడ సీ.పోర్టు, కోన‌సీమ గ్యాస్ దోపిడి త‌దిత‌ర అంశాల‌పై జ‌న‌సేన పార్టీ చేస్తున్న పోరాటాన్ని ప్ర‌ద‌ర్శించారు. అనంత‌పురం ప‌ర్య‌ట‌నలో చేనేత‌లు, క‌రువు రైతుల స‌మ‌స్య‌ల‌పై శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ జ‌రిపిన అధ్య‌య‌నం తాలూకు వివ‌రాల‌ని ఆహుతుల ముందు ఉంచారు. ఓ వైపు జ‌న‌సేనాని ప్ర‌జాప్ర‌స్థానానికి సంబంధించిన వీడియోలో మాట్లాడుతుంటే, ఆయన పోరాటానికి మ‌ద్ద‌తు తెలుపుతూ ప్ర‌వాసులు జ‌య‌జ‌య‌ధ్వానాలు చేశారు.

ప్ర‌వాస గ‌ర్జ‌న స‌భా ప్రాంగ‌ణానికి శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ చేరుకున్న అనంత‌రం జాతీయ గీతంతో స‌భ‌ని ప్రారంభించారు. జ‌న‌సేన పార్టీని కోట్లాది మంది ప్ర‌జ‌ల వ‌ద్ద‌కి తీసుకువెళ్లిన జ‌న‌సేన త‌రంగం కార్య‌క్ర‌మాన్ని శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గారు నిర్వ‌హించిన వీడియోల‌తో పాటు కార్య‌క్ర‌మం ద్వారా జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు  కోటి20 ల‌క్ష‌ల మందికి జ‌న‌సేన సిద్ధాంతాలు వివ‌రించిన వీడియోల‌ని ఆవిష్క‌రించారు. జ‌న‌సేన అధినేత వేదిక మీద‌కి అడుగు పెట్టిన ద‌గ్గ‌ర నుంచి ప్ర‌సంగం పూర్త‌య్యే వ‌ర‌కు జ‌న‌సైనికులు నినాదాల‌తో హోరెత్తించారు. జ‌న‌సేన ప‌తాకంలోని వ‌ర్ణాలు ప్ర‌తిబింబించేలా ఎరుపు, తెలుపు రంగుల స‌మ్మిళిత‌మైన పుష్పాలతో ఆయన పై పూల వర్షం కురిపించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here