Home Uncategorized జ‌న‌సేన విష‌యంలో చంద్ర‌బాబు ఆలోచ‌న ఏంటో బ‌య‌ట‌పెట్టిన ప‌వ‌న్.!

జ‌న‌సేన విష‌యంలో చంద్ర‌బాబు ఆలోచ‌న ఏంటో బ‌య‌ట‌పెట్టిన ప‌వ‌న్.!

107
0

ధ‌వ‌ళేశ్వ‌రం బ్రిడ్జి ద‌గ్గ‌ర ఏర్పాటు చేసిన భారీ బ‌హిరంగ స‌భ‌లో జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాట్లాడుతూ…అధికార ప‌క్షం నాయ‌కులు ప్ర‌తిప‌క్షం నాయ‌కుల‌ను సంత‌లో జంతువుల‌ను కొన్న‌ట్టు కొన్నారు. ఇవ‌న్నీ స‌గ‌టు రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌ను అప‌హాస్యం చేసాయి. ఇలాంటి ప‌రిస్థితుల్లో స‌రికొత్త ఆలోచ‌నా విధానంతో జ‌న‌సేన ఆవిర్భ‌వించింది. 2014లో ఎందుకు పోటీ చేయ‌లేదంటే…నేను ఒక‌టే కోరుకున్నాను. ఒక పొలీస్ కానిస్టేబుల్ అవ్వాల‌న్నా ట్రైనింగ్ తీసుకోవాలి. గెజిటెడ్ ఆఫీస‌ర్ అవ్వాల‌న్నా ఎగ్జామ్స్ రాయాలి. అలాంటిది ఇన్ని కోట్ల మంది ప్ర‌జా జీవితాన్ని శాసించే ఒక రాజ‌కీయ పార్టీని న‌డిపే వ్య‌క్తికి అనుభ‌వం ఉండాలి అని కోరుకున్నాను. అందుకే 2009లో ముందుకు రాలేదు. 2014లో స‌త్తా లేక కాదు. అనుభవంతో ఉన్న వ్య‌క్తి ఒక‌డున్నాడు. ఎన్నో స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్కరిస్తార‌ని చెప్పారు. నేను పార్టీ పెట్టింది. నా స్వ‌ప్ర‌యోజ‌నాల కోసం పెట్ట‌లేదు. స‌మాజ ప్ర‌యోజ‌నాల కోసం…దేశ ప్ర‌యోజ‌నాల కోసం..రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం పెట్టాను అని తెలియ‌చేసారు.

ఈరోజు ఉన్న బ‌లం 2014లో లేదా…? కొత్త‌గా వ‌చ్చిన బ‌ల‌మా..? ఇది..? కాదు క‌దా. అయితే.. ఓట్లు చీల్చి రాష్ట్ర ప‌రిస్థితిని అస్త‌వ్య‌స్ధం చేయ‌డం ఇష్టం లేక బాధ్య‌త‌తో రాష్ట్ర శ్రేయ‌స్సు కోసం దేశ భ‌క్తితో నేను పోటీ చేయ‌కుండా అనుభ‌వం ఉన్న వ్య‌క్తి నారా చంద్ర‌బాబు నాయుడు గార్కి నేను స‌పోర్ట్ చేసాను. ఏ ఒక్క‌రోజు కూడా ఏమీ అడ‌గ‌లేదు. హేరిటేజ్ లాగ నాకు వేల కోట్లు ఉన్న ఫ్యాక్ట‌రీలు లేవు. వంద‌ల కోట్లు చేసే భ‌వ‌నాలు లేవు. కానీ నాకు దేశం మీద ప్రేమ ఉంది. నేను ఏమీ ఆశించ‌లేదు. రాష్ట్రాన్ని బాగా ప‌రిపాలించాల‌ని ముఖ్య‌మంత్రిని కోరుకున్నాను. కానీ..అమ‌రావ‌తిలో పార్టీని స్ధాపించ‌డానికి అస్కారం కూడా రాలేదు. అమ‌రావ‌తిలో పార్టీ ఆఫీస్ ప్రారంభించ‌డం తెలుగుదేశం స‌హ‌రించింది కాదు. అన్ని మ‌తాలు, అన్నికులాలు స‌హ‌క‌రించ‌డంతో మ‌నం జ‌న‌సేన పార్టీని స్ధాపించుకున్నాం. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఇంటికి వెళితే టీ ఇచ్చి మ‌ర్యాద ఇస్తారు కానీ..ఆయ‌న‌కు జ‌న‌సేన పార్టీ ఎద‌గ‌కూడ‌దు. జ‌న‌సేన యువ‌త‌ను ప్ర‌భావితం చేయ‌కూడ‌దు. జ‌న‌సేన ఎప్పుడూ తెలుగుదేశం ప‌ల్ల‌క‌లిని మోస్తూనే ఉండాలి. అది చంద్ర‌బాబు ఆలోచ‌న‌..అంటూ చంద్ర‌బాబు ఆలోచ‌న‌ల్ని బ‌య‌ట‌పెట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here