Home Actor టాలీవుడ్ డ్ర‌గ్స్ కేస్ – సెల‌బ్రిటీలంద‌రికీ క్లీన్ చిట్..!

టాలీవుడ్ డ్ర‌గ్స్ కేస్ – సెల‌బ్రిటీలంద‌రికీ క్లీన్ చిట్..!

146
0

తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం సృష్టించి..ముఖ్యంగా టాలీవుడ్ ని షేక్ చేసి డ్రగ్స్ కేసు గురించి అందరికీ తెలిసిందే. డైరెక్టర్ పూరి జగన్నాథ్, శ్యామ్ కే. నాయుడు, నటుడు సుబ్బరాజు, హీరో తరుణ్, హీరో నవదీప్, హీరోయిన్ ఛార్మీ కౌర్, ముమైత్ ఖాన్, హీరో రవితేజ, శ్రీనివాస్ (రవితేజ కారు డ్రైవర్), హీరో తనీష్, హీరో నందుతో పాటు పలువురు ప్రముఖులను సిట్ అధికారులు  విచారించారు.

అంతే కాకుండా… వారి నుంచి గోర్లు, వెంట్రుకల శాంపిల్స్‌ సేకరించి వారి వాంగ్మూలాన్ని సైతం సిట్ టీమ్ నమోదు చేసింది. కాగా ఈ వ్యవహారంలో అప్పట్లో సిట్ అధికారులు 12 కేసులను నమోదు చేశారు. రెండేళ్ల తర్వాత మరోసారి డ్రగ్స్ కేసు తెలుగు రాష్ట్రాల్లో వెలుగు చూసింది.  ఈ కేసులో ఉన్న సినీ ప్ర‌ముఖులు నిందితులు కాదు.. బాధితులే అని సెలబ్రిటీల పై సిట్ రిపోర్ట్ బయటికొచ్చింది.

 డ్రగ్స్ కేసు గురించి సమాచార హక్కు చట్టం ద్వారా ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ వివరాలు బయటపెట్టింది. సిట్ దాఖలు చేసిన ఛార్జ్ షీట్లలో సిని సెలబ్రిటీల పేర్లు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. డ్రగ్స్‌ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారంటూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కూడా ఫిర్యాదు చేసింది. ఈ కేసులో సిట్ 4 చార్జిషీట్లను దాఖలు చేసినట్టు సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here