Home Political News టీఆర్ఎస్ కి ఓటేస్తే..బీజేపీకి ఓటేసిన‌ట్టే – ఉత్త‌మ్ కుమార్ రెడ్డి..!

టీఆర్ఎస్ కి ఓటేస్తే..బీజేపీకి ఓటేసిన‌ట్టే – ఉత్త‌మ్ కుమార్ రెడ్డి..!

96
0
dc-Cover-fj73uechdvgdtbcna4m6jop8e6-20180406011917.Medi

టీఆర్ఎస్ ప్ర‌భుత్వం చ‌ట్ట స‌భ‌ను ర‌ద్దు చేసి ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్ల‌డం అనేది క‌రెక్ట్ కాదంటూ ప‌లువురు నాయ‌కులు విమ‌ర్శిస్తున్నారు. ప్ర‌జ‌లు 5 సంవ‌త్స‌రాలు ప‌రిపాలించ‌మ‌ని అధికారం ఇస్తే..ముందుగానే శాస‌న‌స‌భ‌ను ర‌ద్దు చేయ‌డం ఏంటి ? అంటూ  ప్ర‌శ్నిస్తున్నారు. కేసీఆర్ త‌న స్వార్ధం కోసం ఇలా చేస్తున్నార‌ని.. ప్ర‌జ‌ల గురించి ప‌ట్టించుకోవ‌డం లేదంటున్నారు. టీపీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ…రెండు, మూడు రోజులుగా అస‌దుద్దీన్ ఓవైసీ కేసీఆర్ కు మ‌ద్ద‌తుగా మాట్లాడుతున్నారు.

ముస్లింల‌కు 12 శాతం రిజర్వేష‌న్ల పై కేసీఆర్ మోసం చేసారన్నారు. ఓవైసీ బ్ర‌ద‌ర్స్ త‌మ స్వార్ధం కోసం ముస్లింల‌ను త‌ప్పు దోవ ప‌ట్టిస్తున్నారు. ఫీజు రియింబ‌ర్స్ మెంటు లేక 90 శాతం మైనార్టీ ముస్లిం కాలేజీలు మూత‌ప‌డ్డాయి. మోడీ ఏజెంట్ కేసీఆర్. అందుచేత‌… టీఆర్ఎస్ కు ఓటేస్తే బీజేపీకి ఓటేసిన‌ట్టే అన్నారు. పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో కేసీఆర్ బీజేపీతో క‌లిసి వెళ‌తారు. అందుకే అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను ముందుకు తీసుకువ‌చ్చార‌ని ఆరోపించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here