Home Political News టీఆర్ఎస్ చీర‌ల వ్యూహం స‌క్సెసా..?  ఫెయిలా..?

టీఆర్ఎస్ చీర‌ల వ్యూహం స‌క్సెసా..?  ఫెయిలా..?

113
0

టీఆర్ఎస్ ప‌క్కా ప్లాన్ తో ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. అయితే…టీఆర్ఎస్ కు ఓ వైపు అసంతృప్తులను నుంచి షాక్ త‌గులుతుంటుంటే…మ‌రో వైపు ఎన్నిక‌ల క‌మీష‌న్ నుంచి షాక్ త‌గులుతూనే ఉంది. ఇంత‌కీ విష‌యం ఏంటంటే..ఎన్నిక‌ల కోడ్ వ‌ల‌న టీఆర్ఎస్ ప్లాన్ చేసుకున్న చీర‌ల పంపిణి కార్య‌క్ర‌మానికి బ్రేక్ ప‌డింది. మ‌హిళ‌ల కోసం 96 ల‌క్ష‌ల చీర‌ల‌ను పంపిణీ చేయాల‌నుకున్నారు.

280 కోట్ల రూపాయ‌ల‌తో ఖ‌రీదు చేసిన ఈ చీర‌ల‌ను బ‌తుక‌మ్మ చీర‌ల ప‌థ‌కం కింద పంపిణీ చేయాల‌నుకున్నారు టీఆర్ఎస్ నేత‌లు. అయితే… తెలుగుదేశం, కాంగ్రెస్ నేత‌లు ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేయ‌డంతో ఈ పంపిణీ కార్య‌క్ర‌మానికి బ్రేక్ ప‌డింది. గ‌త సంవ‌త్స‌రం ప్ర‌క‌టించిన ప‌థ‌కం క‌దా..ఇబ్బంది ఉండ‌దు అనుకుంది టీఆర్ఎస్. అయితే..ప్ర‌తిప‌క్షాల ప్లాన్ ఫ‌లించింది. టీఆర్ఎస్ ప్లాన్ ఫెయిల్ అయ్యింది.చీర‌ల పంపిణికి బ్రేక్ ప‌డ‌డాన్ని టీఆర్ఎస్ మ‌రో వాడుకోవాలి అనుకుంటుంద‌ట‌.

ఏంటంటే..టీఆర్ఎస్ మ‌హిళా నేత‌లు కాంగ్రెస్, టీడీపీ వ‌ల్ల‌నే చీర‌ల పంపిణీకి బ్రేక్ ప‌డింది అని  ప్ర‌చారం చేస్తూ జ‌నంలోకి తీసుకెళుతున్నారు. ఇదిలా ఉంటే..ఎన్నిక‌ల కోడ్ వ‌ల‌న  ఈనెల 12న పంపిణీ చేయాల‌నుకున్నబ‌తుక‌మ్మ‌ చీర‌ల పంపిణీకి అనుమ‌తి ఇవ్వ‌డం లేదు. దీనిని ఒక‌సారి ప‌రిశీలించండి అంటూ రాష్ట్ర ఎన్నిక‌ల క‌మీష‌న్ కు తెలంగాణ గ‌వ‌ర్న‌మెంట్ ఓ లేఖ‌  రాసింది.  గతేడాదే ప్రారంభించిన చీరల పంపిణీ కార్యక్రమాన్ని పాత కార్యక్రమంగా పరిగణించి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతిస్తుందని రాష్ట్రంలోని ఆపద్ధర్మ ప్రభుత్వం భావించింది. కానీ, అనూహ్య రీతిలో అనుమతి నిరాకరించడంతో ప్రభుత్వానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here