Home Actress టీఆర్ఎస్ ప్ర‌భుత్వం పై ఫైరైన విజ‌య‌శాంతి..!

టీఆర్ఎస్ ప్ర‌భుత్వం పై ఫైరైన విజ‌య‌శాంతి..!

99
0

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ విజ‌యం సాధించ‌డం ఖాయం అంటూ కాంగ్రెస్ నాయ‌కులు చాలా థీమా వ్య‌క్తం చేసారు. ఎన్నిక‌ల ఫ‌లితాలు రాకుండానే కాంగ్రెస్ నాయ‌కులు గ‌వ‌ర్న‌ర్ ను క‌లిసి ఎన్నిక‌ల ముందు పొత్త పెట్టుకున్న వాళ్ల‌ను ఒక కూట‌మిగా చూడాల‌ని…ఎన్నిక‌ల త‌ర్వాత క‌లిసి పార్టీల‌ను కూట‌మిగా ప‌రిగ‌ణించ‌వ‌ద్ద‌ని చెప్పారు. దీనిని బ‌ట్టి అర్ధం చేసుకోవ‌చ్చు. కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు..త‌మ‌ పార్టీ అధికారంలోకి వ‌స్తుంద‌ని ఎంత న‌మ్మ‌కంగా ఉన్నారో.

అయితే..కాంగ్రెస్ పార్టీ నాయ‌కుల అంచ‌నాలు తారుమారు అయ్యాయి. పార్టీ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించ‌డంలో ఫెయిల్ అయ్యింది. ప‌రాజ‌యం పై అథిష్టానం ఆరా తీస్తుంది. తెలంగాణ నేత‌ల‌తో ఈ నెల 26న ఢిల్లీలో స‌మావేశం ఏర్పాటు చేసారు. ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, భ‌ట్టి విక్ర‌మార్క‌ల‌తో పాటు ఇత‌ర ముఖ్య నేత‌ల‌కు పిలుపు వ‌చ్చింది. భేటీ త‌ర్వాత రాష్ట్ర కాంగ్రెస్ లో కీల‌క ప‌రిణామాలు జ‌ర‌గ‌నున్నాయ‌ని స‌మాచారం.

ఇదిలా ఉంటే…కాంగ్రెస్ పార్టీ నాయ‌కురాలు విజ‌య‌శాంతి స్పందిస్తూ…తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఫ‌లితాలు వ‌చ్చి రెండు వారాలు అవుతున్నా..ఇప్ప‌టి వ‌ర‌కు స‌మావేశం లేదు.ఎమ్మెల్యేల ప్ర‌మాణ స్వీకారం జ‌ర‌గ‌లేదు. కేబినేట్ ఏర్పాటు కాలేదు. ముఖ్య‌మంత్రి రాష్ట్రంలో లేరు. ఇదీ..ప్ర‌స్తుత తెలంగాణ ప్ర‌జాస్వామ్య ప‌రిస్థితి అంటూ ఫైర్ అయ్యారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here