Home Political News టీడీపీ గెలిస్తే పాల‌మూరు ఎత్తిపోత‌ల ప్రాజెక్ట్ పూర్తి కాదు – మంత్రి కేటీఆర్

టీడీపీ గెలిస్తే పాల‌మూరు ఎత్తిపోత‌ల ప్రాజెక్ట్ పూర్తి కాదు – మంత్రి కేటీఆర్

107
0

సీఎం కేసీఆర్ పాల‌న‌లో మ‌క్త‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో ల‌క్ష ఎక‌రాల‌కు సాగునీరు ఇచ్చాం. తెలంగాణ వ‌స్తే..అంథ‌కార‌మౌతుంద‌ని నాటి సీఎం కిర‌ణ్ కుమార్ రెడ్డి అన్నాడు. వ్య‌వ‌సాయానికి 24 గంట‌లు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం అని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ తెలియ‌చేసారు. ఆంధ్రాను బ‌ల‌వంతంగా తెలంగాణ‌లో క‌లిపింది కాంగ్రెస్ పార్టీనే. పాల‌మూరి జిల్లాలో 9 ల‌క్ష‌ల ఎక‌రాల‌కు నీరిచ్చిన ఘ‌న‌త టీఆర్ఎస్ ది అని చెప్పారు. పాల‌మూరులో వ‌ల‌స‌లు వాప‌స్ రావ‌డానికి కార‌ణం..టీఆర్ఎస్ పాల‌నే. కాంగ్రెస్ పార్టీ ప్ర‌గ‌తి నిరోధ‌క చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతుంది.పాల‌మూరు ప‌చ్చ‌బ‌డుతుంటుంటే ఓర్వ‌లేక కాంగ్రెస్ నాయ‌కులు కేసులు వేసారు అన్నారు కేటీఆర్.

నాలుగేళ్ల‌లో ముక్త‌ల్ ల్లో ల‌క్ష ఎక‌రాల‌కు నీరు అందించాం. గెలిచేది టీఆర్ఎస్ పార్టీనే. ముఖ్య‌మంత్రి కేసీఆరే అని అంద‌రికీ తెలుసు. రాజ‌కీయ ఉనికి కోస‌మే కాంగ్రెస్ నేత‌లు కేసులు వేస్తున్నారు. తెలంగాణ‌కు అడ్డం ప‌డ్డ రెండు గ‌డ్డాలు ఉత్త‌మ్, చంద్ర‌బాబు ఒక‌ట‌య్యారు. చంద్ర‌బాబు చేతిలో జుట్టు ఉంటే..ప్రాజెక్టులు ఆగిపోవా..?  ద‌య‌చేసి ప్ర‌జ‌లు ఆలోచించాలి అన్నారు. పాల‌మూరు ఎంపీగా కేసీఆర్ తెలంగాణ సాధించారు. పాల‌మూరు ఎత్తిపోత‌ల‌తో జిల్లా మొత్తం స‌స్య‌శ్యామ‌లం అవుతుంది.

ముక్త‌ల్ అభివృద్ది కోస‌మే రామ్ మోహ‌న్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరారు. కాట‌న్ మిల్లు స్ధ‌లంలో పారిశ్రామిక వాడ ఏర్పాటు చేస్తాం. పాల‌మూరు ఎత్తిపోత‌ల‌ను ఆపాల‌ని చంద్ర‌బాబు కేంద్రానికి లేఖ రాసారు. మ‌హాకూట‌మి అధికారంలోకి వ‌స్తే..పాల‌మూరు ప్ర‌జ‌ల నోట్లో మ‌ట్టిప‌డుతుంది అని చెప్పారు. పాల‌మూరు పచ్చ‌బ‌డుతుంటుంటే…వాళ్ల క‌ళ్లు ఎర్ర‌బ‌డుతున్నాయి. పాల‌మూరు ప్ర‌యోజ‌నాల విష‌యంలో ఎవ‌రికీ భ‌య‌ప‌డే ప్ర‌సక్తే లేదు. మ‌క్త‌ల్ లో టీడీపీ గెలిస్తే పాల‌మూరు ఎత్తిపోత‌ల ప్రాజెక్ట్ పూర్తి కాదు. చంద్ర‌బాబు పార్టీ తెలంగాణ‌కు అవ‌స‌ర‌మా అని ప్ర‌శ్నించారు కేటీఆర్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here