Home Actor టెంట్లు వేసుకుని అయినా పార్టీని న‌డుపుతాం – ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

టెంట్లు వేసుకుని అయినా పార్టీని న‌డుపుతాం – ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

118
0
టెంట్లు వేసుకుని అయినా పార్టీని న‌డుపుతాం - ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ spiceandhra

మంగ‌ళ‌గిరిలోని జ‌న‌సేన‌ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో కాకినాడ పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో ప‌వ‌న్‌క‌ళ్యాణ్ మాట్లాడుతూ..నా మొద‌టి సినిమా ఫెయిల్ అవ‌గానే ఉద్యోగం చేసుకోమంటూ కొంద‌రు స‌ల‌హా ఇచ్చారు. అయితే ఓడిన చోటే వెతుక్కుంటూ వెళ్లా. ఇప్పుడు వైసీపీ భారీ విజ‌యం సాధించినా, జ‌న‌సేన పార్టీకి ఘోర ప‌రాజయం ఎదురైనా ఎక్క‌డికీ వెళ్ల‌ను, ఇక్క‌డే ఉంటా గెలిచే వ‌ర‌కు పోరాటం చేస్తా అని ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్ప‌ష్టం చేసారు. ఎన్నిక‌ల్లో  ఓట‌మి అనంత‌రం కూడా చాలా మంది అడిగారు పార్టీని న‌డ‌ప‌గ‌ల‌రా అని. ఒక సినిమా తీస్తే పార్టీ సంవ‌త్స‌రం న‌డుస్తుంది. స్వ‌శ‌క్తితో ఇక్క‌డి వ‌ర‌కు వ‌చ్చాను. మా నాన్న‌గారు సిఎం కాదు ఇన్‌స్టెంట్‌గా నాకు అన్నీ వ‌చ్చేయ‌డానికి.

అయినా ఇంత ఆఫీస్ నిర్మించాం అంటే అందంతా మా క‌ష్టం. పార్టీని న‌డ‌పడం కూడా చాలా క‌ష్టం. దానికి ఎన్నో మాట‌లు ప‌డాలి. దెబ్బ‌లు తినాలి. వాట‌న్నింటికీ నేను సిద్ధంగా ఉన్నా. దేశ వ్యాప్తంగా శ‌క్తివంత‌మైన పార్టీగా ఉన్న బీజేపీకే రాష్ట్రంలో ఒక్క శాతం ఓటు వ‌చ్చింది.  అలాంటిది మ‌నం ఇంత వ‌ర‌కు వ‌చ్చాం అంటే అది చాలా గొప్ప విజ‌యం. ఆఫీస్ ఉంటుందా, పార్టీ న‌డుపుతారా.? అంటూ గేలి చేస్తున్నారు. మేం ఎవ‌రినీ డబ్బులేం అడ‌గ‌లేదే. అవ‌స‌రం అయితే టెంట్లు వేసుకుని పార్టీని న‌డుపుతాం. నేను వ‌చ్చింది ఒక ప‌టిష్ట‌మైన సామాజిక వ్య‌వ‌స్థ‌ని నిల‌బెట్ట‌డానికి. నా ఒక్క‌డి గుర్తింపు కోస‌మే అయితే ఆ రోజు అన్న‌య్య‌గారితో పాటు వెళ్లిపోయే వాడిని. అస‌లు పార్టీని విలీనం చేయ‌నిచ్చే వాడినే కాదు. అప్ప‌ట్లో ఎన్టీఆర్ పార్టీ పెట్టిన‌ప్పుడు బ‌ల‌మైన నాయ‌కుల మ‌ద్ద‌తు ల‌భించింది. కాంగ్రెస్ పార్టీ వైసీపీగా రూపు మార్చుకుంది. జ‌న‌సేన పార్టీకి మాత్రం పెద్ద పెద్ద నాయ‌కులు ఎవ‌రూ లేరు. చిన్న చిన్న వ్య‌క్తులు, నేనంటే ఇష్ట‌ప‌డి వ‌చ్చిన జ‌న‌సైనికులు మాత్ర‌మే నాతో ఉన్నారు.

స‌మాజం మారాలి అన్న ల‌క్ష్యంతోనే పార్టీ స్థాపించా. రాష్ట్రం విచ్ఛిన్నం అయిపోతూ ఉంటే విభ‌జ‌న తాలూకు తీవ్ర‌త కాకినాడ‌కు తెలియ‌క‌పోవ‌చ్చు. అప్పటి  ప‌రిణామాలు చూస్తే మాత్రం ఏ చిన్న త‌ప్పు జ‌రిగినా ర‌క్త‌పాతానికి కార‌ణ‌మ‌య్యే ప‌రిస్థితులు ఉన్నాయి. రాష్ట్ర విభ‌జ‌న అనే ఆ చారిత్ర‌క నిర్ణ‌యానికి  కాకినాడే వేదిక అయ్యింది అని ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్నారు. ఈ స‌మావేశంలో పార్టీ రాజ‌కీయ వ్య‌వ‌హారాల క‌మిటీ చైర్మ‌న్ శ్రీ నాదెండ్ల మ‌నోహ‌ర్ ప్రారంభోప‌న్యాసం చేయ‌గా, ప్యాక్ స‌భ్యులు శ్రీ నాగ‌బాబు, కాకినాడ పార్ల‌మెంట్ అభ్య‌ర్ధి శ్రీ జ్యోతుల వెంక‌టేశ్వ‌ర‌రావు, కాకినాడ అర్బన్‌, రూర‌ల్ అభ్య‌ర్ధులు శ్రీ ముత్తా శ‌శిధ‌ర్‌, శ్రీ పంతం నానాజీ, పిఠాపురం అభ్య‌ర్ధి శ్రీమ‌తి మాకినీడి శేషుకుమారి, పెద్దాపురం అభ్య‌ర్థి శ్రీ తుమ్మ‌ల రామ‌స్వామి, జ‌గ్గంపేట అభ్య‌ర్ధి శ్రీ పాటంశెట్టి సూర్య‌చంద్ర‌, ప‌త్తిపాడు అభ్య‌ర్ధి శ్రీ వ‌రుపుల త‌మ్మ‌య్య‌బాబు త‌దిత‌రులు కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి మాట్లాడారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here