Home Actor టైటిల్ కోసం విజ‌య్ తో పోటీప‌డుతున్న త‌మిళ హీరో..!

టైటిల్ కోసం విజ‌య్ తో పోటీప‌డుతున్న త‌మిళ హీరో..!

99
0


యువ సంచ‌ల‌నం విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా డియ‌ర్ కామ్రేడ్ అనే సినిమా రూపొందుతోంది. భ‌ర‌త్ క‌మ్మ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ సినిమాని మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇదే సంస్థ విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో హీరో అనే టైటిల్ తో సినిమా చేస్తుంది. తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 22న న్యూఢిల్లీలో ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేయ‌నున్నారు. దీనికి ఆనంద్ అన్నామ‌లై ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

హీరో అనే టైటిల్ తో త‌మిళ హీరో శివ కార్తీకేయ‌న్ ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఈరోజు ప్రారంభ‌మైంది. ఇందులో క‌థానాయిక‌గా క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ న‌టిస్తున్నారు. దీనికి పి.ఎస్. మిత్ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. విజ‌య్, శివ కార్తీకేయ‌న్ ఇద్ద‌రిలో ఎవ‌రో ఒక‌రు త‌మిళ టైటిల్ మార్చుకోవాలి. విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమాను నాలుగు భాష‌ల్లో రూపొందిస్తున్నారు కాబ‌ట్టి..ఈ నాలుగు భాష‌ల్లో ఒకే టైటిల్ ఉంటే బాగుంటుంద‌ని ఈ టైటిల్ ఫిక్స్ చేసారు.

ఇప్పుడేమో శివ కార్తీకేయ‌న్ అదే టైటిల్ తో సినిమా చేస్తున్నారు. మ‌రి..శివ కార్తీకేయ‌నే టైటిల్ మార్చుకుంటారా..?  లేక విజ‌య్ దేవ‌ర‌కొండ టైటిల్ మార్చుకుంటారా..?  అనేది చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here