Home Movie News ట్రేడ్ టాక్ – సిల్లీ ఫిలోస్ సూపర్ హిట్..!

ట్రేడ్ టాక్ – సిల్లీ ఫిలోస్ సూపర్ హిట్..!

108
0
Silly fellows super hit

ఈ వారం సిల్లీ ఫెలోస్, C/o కంచ‌ర‌పాలెం, మ‌ను…ఈ మూడు చిత్రాలు థియేట‌ర్స్ లో వ‌చ్చాయి. సిల్లీ ఫెలోస్ అవుట్ అండ్ అవుట్ మాస్ కామెడీ ఎంట‌ర్ టైన‌ర్. C/o కంచ‌ర‌పాలెం సహ‌జ‌త్వంతో తీసిన వైవిధ్య‌మైన ప్రేమ‌క‌థ‌. మ‌ను ఎక్స్ పీరిమెంట‌ల్ థ్రిల్ల‌ర్. ఈ మూడు వైవిధ్య‌మైన చిత్రాలకు తెలుగు రాష్ట్రాల్లోను, ఓవ‌ర్ సీస్ లోను త్రి డిఫ‌రెంట్ రిజెల్ట్స్ రావ‌డం విశేషం.

బి,సి సెంట‌ర్స్ లో ఆడియ‌న్స్ మాస్ కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ అయిన సిల్లీ ఫెలోస్ చిత్రానికి బ్ర‌హ్మరథం ప‌డుతున్నారు. ముఖ్యంగా ఈ చిత్రంలోని జ‌య‌ప్ర‌కాష్ రెడ్డి, పోసాని మ‌ధ్య చిత్రీక‌రించిన కామెడీ సీన్స్ ను ఆడియ‌న్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. స‌రైన స‌క్స‌స్ కోసం ఎదురుచూస్తున్న అల్ల‌రి న‌రేష్‌, సునీల్ ల‌కు సిల్లీ ఫెలోస్ సూప‌ర్ హిట్ మూవీ అని చెప్ప‌చ్చు.

C/o కంచ‌ర‌పాలెం చిత్రం కొత్త‌ద‌నం కోరుకునే సినీ ప్రియులను విశేషంగా ఆక‌ట్టుకుంటుంది. ఈ చిత్రం మ‌ల్టీ ఫ్లెక్స్ లోను, ఓవ‌ర్ సీస్ లోను మంచి క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేస్తుంది. శ‌నివారానికి ఈ మూవీ ఓవ‌ర్ సీస్ లో $125K వ‌సూలు చేసింది. ఈ ఇయ‌ర్ లో C/o కంచ‌ర‌పాలెం స‌ర్ ఫ్రైజ్ హిట్ గా నిలుస్తుంది అన‌డంలో సందేహం లేదు. చివ‌ర‌గా క్రౌడ్ ఫండెడ్ ఎక్స్ పీరిమెంట‌ల్ ఫిల్మ్ మ‌ను విష‌యానికి వ‌స్తే…ప్ర‌తి ఒక్క‌రిని నిరాశ ప‌రిచింది. ఇటు ఇండియాలోను, అటు అమెరికాలోను ఏమాత్రం ఆక‌ట్టుకోలేక‌పోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here