Home Movie News ట్రైల‌ర్ తో  అంచ‌నాల‌ను పెంచేస్తోన్న పందెం కోడి 2..!

ట్రైల‌ర్ తో  అంచ‌నాల‌ను పెంచేస్తోన్న పందెం కోడి 2..!

140
0
DoPpfW3UwAAh1SC

విశాల్ కెరీర్ లో మ‌ర‌చిపోలేని చిత్రం పందెం కోడి. 2005లో ప్రేక్ష‌కుల ముందుకు  వ‌చ్చిన పందెం కోడి తెలుగులో అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంది. అంతే కాకుండా…విశాల్ కి తెలుగులో మంచి క్రేజ్ తీసుకువ‌చ్చింది పందెం కోడి సినిమానే. ఇప్పుడు 13 సంవ‌త్స‌రాల త‌ర్వాత పందెం కోడి సినిమాకి సీక్వెల్ గా పందెం కోడి 2 రూపొందుతోంది. లింగుస్వామి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న పందెం కోడి 2 ద‌స‌రాకి ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది.

పందెం కోడి సినిమాలో విశాల్ స‌ర‌స‌న మీరా జాస్మిన్ న‌టిస్తే…పందెం కోడి 2 లో విశాల్ స‌ర‌స‌న కీర్తి సురేష్ న‌టించింది. వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్, రాజ్ కిర‌ణ్ కీల‌క పాత్ర‌లు పోషించారు. ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 18న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సంద‌ర్భంగా పందెం కోడి 2 ట్రైల‌ర్ ను రిలీజ్ చేసారు. ఇక ట్రైల‌ర్ విష‌యానికి వ‌స్తే… ప్రధానమైన పాత్రలను కవర్ చేస్తూ .. యాక్షన్ దృశ్యాలకి ప్రాధాన్యతనిస్తూ ఈ ట్రైలర్ ను కట్ చేశారు.

గ్రామీణ నేపథ్యంలో పెరిగిన ఆకతాయి అమ్మాయిగా కీర్తి సురేష్‌ కనిపిస్తోంది. ఇక నెగెటివ్ షేడ్స్ వున్న పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ నటన ఆకట్టుకునేలా వుంది. జాతరలో పులి వేషాలు వేయొచ్చు.. కానీ.. పులిముందే వేషాలు వేయకూడదు అనే డైలాగ్ బాగా పేలింది. ఈ ట్రైలర్ ని  చూస్తుంటే…పందెం కోడి 2 చిత్రానికి విజ‌యం ఖాయం అనిపిస్తోంది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here